అన్ని సమస్యలకు ఒకటే మందు.. ఎన్నికల వేళ విదేశాలకు విజయమ్మ
ABN , Publish Date - Apr 12 , 2024 | 05:00 PM
కరవమంటే కప్పకు కోపం... విడమంటే పాముకు కోపం అన్న చందంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ ప్రస్తుత పరిస్థితి ఉందనే ఓ చర్చ అయితే రాజకీయ వర్గాల్లో వైరల్ అవుతోంది. అందుకే ఆమె విదేశాలకు వెళ్లిపోయారని సదరు సర్కిల్‌లో చర్చ సైతం వాడి వేడిగా నడుస్తోంది.
కరవమంటే కప్పకు కోపం... విడమంటే పాముకు కోపం అన్న చందంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ (YS Vijayamma) ప్రస్తుత పరిస్థితి ఉందనే ఓ చర్చ అయితే రాజకీయ వర్గాల్లో వైరల్ అవుతోంది. అందుకే ఆమె విదేశాలకు వెళ్లిపోయారని సదరు సర్కిల్‌లో చర్చ సైతం వాడి వేడిగా నడుస్తోంది. నిన్న మొన్నటి వరకు ఫ్యామిలీలో పరిస్థితులు వేరుగా ఉన్నాయని.. కానీ నేడు పరిస్థితిలు అందుకు భిన్నంగా ఉన్నాయని.. ఆ క్రమంలో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది.
గతంలో వైయస్ షర్మిల (YS Sharmila) తెలంగాణలో పార్టీ స్థాపించడంతో.. ఆమె వెంట వైయస్ విజయమ్మ అడుగులో అడుగు వేసి నడిచారు. కానీ నేడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అంటే.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో వైయస్ జగన్ (YS Jagan) అధికారంలో ఉన్నారు. ఇక ఏపీ పీసీసీ అధ్యక్షురాలి (AP PCC Chief)గా వైయస్ షర్మిల బాధ్యతలు చేపట్టారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే తన రక్తం పంచుకు పుట్టిన ఈ ఇద్దరు బిడ్డలు.. ప్రత్యర్థులుగా మారి ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకొంటున్నారు.
AP Elections: షర్మిలపై వైసీపీ ఎమ్మెల్యే సెన్సేషనల్ కామెంట్స్.. ఏమన్నారో తెలుసా..
ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల్లో కుమార్తెకు అనుకూలంగా ప్రచారం నిర్వహిస్తే.. కుమారుడికి నష్టం జరిగే అవకాశం ఉంది. అలాగే కుమారుడికి కన్నతల్లిగా మద్దతు ఇచ్చి ఎన్నికల ప్రచారం చేపడితే.. కుమార్తెకు రాజకీయంగా ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయని వైయస్ విజయమ్మ ఓ విధమైన ఆందోళనకు గురైనట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో మధ్య మార్గంగా ఫారన్ టూర్ ప్లాన్ చేసుకొని ఆమె వెళ్లిపోయినట్లు ఓ చర్చ సైతం హల్‌చల్ చేస్తోంది.
KA Paul: ప్రజాశాంతి పార్టీ గుర్తు మారిందండోయ్.. కొత్త గుర్తు ఏంటంటే..
అదీకాక మార్చిలో సీఎం వైయస్ జగన్ మేము సిద్దం పేరిట ఇడుపులపాయ నుంచి బస్సు యాత్ర చేపట్టారు. ఆ సమయంలో కన్నతల్లి వైయస్ విజయమ్మ నుంచి ఆశీర్వాదం తీసుకొని వైయస్ జగన్ ఈ యాత్రకు శ్రీకారం చుట్టారు. దాంతో వైయస్ విజయమ్మ కుమారుడు వైయస్ జగన్‌తోనే ఉన్నారనే ఓ స్పష్టమైన సందేశం అయితే ఆ సమయంలో ప్రజల్లోకి నేరుగా వెళ్లినట్లు అయింది.
మరోవైపు వైయస్ షర్మిల సైతం ఎన్నికల ప్రచారానికి వెళ్తుంటే.. బొట్టు పెట్టి మరీ ఆమెను ఆశీర్వదించారీ వైయస్ విజయమ్మ. దీంతో వైయస్ విజయమ్మ వ్యవహార శైలికి ఎవరికీ అంతుబట్టని విధంగా తయారైంది. అంటే కన్నతల్లిగా వైయస్ విజయమ్మ.. కుమారుడు వైయస్ జగన్ వైపా... లేకుంటే కుమార్తె వైయస్ షర్మిల వైపా అనే సందిగ్దంలోకి ప్రజలు అయితే పూర్తిగా జారిపోయారు.
AP Politics: భయంతో వ్యక్తిగత జీవితాల్లోకి జగన్ రెడ్డి చూస్తున్నారు: దేవినేని ఉమ విసుర్లు
అలాంటి పరిస్థితుల్లో శతక కారుడు బద్దెన చెప్పినట్లు ఒకరినొప్పింక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్లు మధ్యే మార్గంగా ఆమె విదేశాలకు వెళ్లిపోవడమంత ఉత్తమమైన మార్గం మరొకటి లేదని భావించి ఆమె విదేశాలకు వెళ్లినట్లు సమాచారం.
మరోవైపు గత ఎన్నికల వేళ.. అంటే 2019లో వైయస్ జగన్‌ని ముఖ్యమంత్రిని చేస్తే రాజన్న రాజ్యం తీసుకు వస్తానంటూ వైయస్ ఫ్యామిలీలోని వారంతా ప్రజల మధ్యకు వెళ్లి ఢంకా భజాయించి మరీ ప్రచారం చేశారు. దీంతో ప్రజలంతా వైసీపీని గంపగుత్తుగా ఓట్లు వేసి గెలిపించారు. దాంతో ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ బాధ్యతలు చేపట్టారు. నాటి నుంచి నేటి వరకు రాష్ట్ర ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు.
AP Election 2024: చంద్రబాబు నివాసంలో ముగిసిన ఎన్డీఏ కూటమి భేటీ.. ఈ అంశాలపైనే చర్చ!
ఆ క్రమంలో ఒక్కసారంటే.. ఒక్కసారి కూడా వైయస్ విజయమ్మ రాష్ట్రం వైపు తొంగి చూసింది లేదు. సరికదా, ప్రజలు పడుతోన్న ఇబ్బందులపై ఆమె పెదవి సైతం విప్పలేదు. ఇంకా సోదాహరణగా వివరించాలంటే రాష్ట్రానికి మూడు రాజధానులంటూ సీఎం వైయస్ జగన్ అసెంబ్లీలో స్వయంగా ప్రకటన చేశారు.
AP Elections: కాంగ్రెస్, వామపక్ష పార్టీల పొత్తు.. ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారంటే..
దీంతో రాజధానికి భూములు ఇచ్చిన రైతులు ఆందోళనలు, నిరసనలు, ధర్నాలే కాదు.. పాదయాత్రలు సైతం చేశారు. కనీసం ఆ సమయంలో అయినా వైయస్ విజయమ్మ స్పందించిన దాఖలాలు అయితే లేవు. ఇటువంటి పరిస్థితుల్లో వైయస్ విజయమ్మ.. ప్రస్తుత ఎన్నికల వేళ.. వైయస్ జగన్ తరపున కానీ.. వైయస్ షర్మిలకు మద్దతుగా కానీ ప్రజల్లోకి వెళ్లితే.. వారి నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశాలు సైతం ఉన్నాయనే ఓ చర్చ సైతం రాజకీయ వర్గాల్లో సాగుతోంది.
అంతేకాదు ఆమెను ప్రజలు సైతం నిర్భయంగా నిలదీసే అవకాశాలు లేకపోలేదనే ప్రచారం సైతం నడుస్తోంది. ఆ క్రమంలో అన్ని ప్రశ్నలకు ఒకటే మందు.. ఎన్నికల వేళ కామ్‌గా సైడ్ అయిపోవడం మినహా మరో అత్యత్తమ మార్గం లేదని వైయస్ విజయమ్మ నిర్ణయించుకొని.. విదేశాలకు వెళ్లి పోయినట్లు రాజకీయ వర్గాల్లో ఓ చర్చ అయితే వైరల్ అవుతోంది.
ఏపీ వార్తలు కోసం..