Share News

Spontaneous Inspection : బాలికల ఉన్నత పాఠశాల ఆకస్మిక తనిఖీ

ABN , Publish Date - Sep 10 , 2024 | 11:20 PM

జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలె క్టర్‌ చామకూరి శ్రీధర్‌ పాఠశాలలో ఉపాధ్యాయులు అటెండెన్స్‌ రిజిస్టర్‌ తనిఖీ చేశారు.

Spontaneous Inspection : బాలికల ఉన్నత పాఠశాల ఆకస్మిక తనిఖీ
విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్న కలెక్టర్‌ చామకూరి శ్రీధర్‌

చిన్నమండెం, సెప్టెంబరు10: జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలె క్టర్‌ చామకూరి శ్రీధర్‌ పాఠశాలలో ఉపాధ్యాయులు అటెండెన్స్‌ రిజిస్టర్‌ తనిఖీ చేశారు. విద్యార్థుల సం ఖ్య, పాఠశాలలో రోజు వారి అమలు చేస్తున్న మె నూ ప్రకారం, లెసన్‌ ప్రణాళికలు, టాయిలెట్స్‌ నిర్వ హణలపై పాఠశాల ప్రధానోపాధ్యాయులపై రమాదే విని వివరాలు అడిగి తెలుసుకున్నారు. పాఠశాల గట్టుపై కూర్చుని విద్యార్థినులతో మమేకమై చదు వుపై వారికి గల ఆసక్తి పాఠ శాలలో విద్యాబోధన, అమలు చేస్తున్న మెనూపై ఆరా తీశారు. మెనూ నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేసిన విద్యార్థిను లు, ఉపాధ్యాయులతో కలిసి పాఠశాలలో భోజనం చేసి కలెక్టర్‌ మెనూ నాణ్యతను పరిశీలించారు.

సమస్యలపై ఆరా తీసిన కలెక్టర్‌

పాఠశాలలో నెలకొన్న సమస్యలపై అన్నమయ్య జిల్లా కలెక్టర్‌ చామకూరి శ్రీధర్‌ ఆరా తీశారు. పాఠశాలకు ప్రహరీ లేదని, ఏర్పాటు చేయాలని, తాగునీరు ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు విన్నవించిన విద్యార్థినులు, ఉపాధి హామీ కింద ప్రహరీ వరకు ప్రతిపాదనలు ఇచ్చామని, ఇంకా మంజూరు కాలేదని కలెక్టర్‌కు పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమాదేవి వివరిం చారు. ప్రహరీ నిర్మాణానికి వెంటనే చర్యలు తీసుకుంటామని, ప్రత్యేక నిధులతో తాగునీటి కొరకు ఆర్‌ఓ ప్లాంట్‌ ఏర్పాటు చేస్తామని విద్యార్థినులకు హామీ ఇచ్చిన కలెక్టర్‌ సర్వేయర్‌తో పాఠశాల ప్రహరీ కొలతలు వేయించాలని ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 10 , 2024 | 11:21 PM