శ్రీ మావుళ్ళమ్మ అనుగ్రహమే ‘పురాణపండ’ పవిత్ర గ్రంధ తేజస్సు
ABN , Publish Date - Aug 10 , 2024 | 12:05 AM
ఎన్నో సంవత్సరాలుగా ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ అపురూపమైన దివ్య గ్రంధాలు శ్రీ మావుళ్ళమ్మ తల్లి సన్నిధానానికి వచ్చి.. వేల భక్తుల్ని ఆకట్టుకుని, పారాయణా ప్రార్ధన గ్రంథాలుగా ఎందరి గడపలకో చేరుతున్నాయి. మళ్ళీ ఈ శ్రావణ మాసం తొలి శుక్రవారంనాడు ఈ పరమాద్భుత గ్రంధాన్ని ఆవిష్కరించడం కేవలం అమ్మవారి అనుగ్రహమేనన్నారు శ్రీమావుళ్ళమ్మ దేవస్థానం కార్యనిర్వహణాధికారి బుద్ధా మహాలక్ష్మీ నరేష్.
భీమవరం, ఆగస్ట్ 9: ఎన్నో సంవత్సరాలుగా ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ అపురూపమైన దివ్య గ్రంధాలు శ్రీ మావుళ్ళమ్మ తల్లి సన్నిధానానికి వచ్చి.. వేల భక్తుల్ని ఆకట్టుకుని, పారాయణా ప్రార్ధన గ్రంథాలుగా ఎందరి గడపలకో చేరుతున్నాయి. మళ్ళీ ఈ శ్రావణ మాసం తొలి శుక్రవారంనాడు ఈ పరమాద్భుత గ్రంధాన్ని ఆవిష్కరించడం కేవలం అమ్మవారి అనుగ్రహమేనన్నారు శ్రీమావుళ్ళమ్మ దేవస్థానం కార్యనిర్వహణాధికారి బుద్ధా మహాలక్ష్మీ నరేష్.
శ్రావణ శుక్రవారం ఉదయం శ్రీ మావుళ్ళమ్మ తల్లి దేవస్థానంలో ప్రముఖ రచయిత, శ్రీశైల దేవస్థానం ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ అద్భుత రచనాసంకలనమైన శ్రీలలిత విష్ణు సహస్రనామ స్తోత్రమ్ మూడు వందల పేజీల పరమాద్భుత గ్రంధాన్ని ఆయన ఆవిష్కరించారు. వచ్చే శ్రావణ వరలక్ష్మీ వ్రతం సందర్భంగా జరిగే ప్రత్యేక అర్చనల్లో పాల్గొనే ముత్తయిదువులకు ఈ అపూర్వ గ్రంధాన్ని ఉచితంగా అందించనున్నట్లు మహాలక్ష్మీ నరేష్ పేర్కొన్నారు.
ఇప్పటికే విజయవాడ శ్రీకనకదుర్గమ్మ సన్నిధానంలోనూ, రాజమహేంద్రవరం శ్రీమార్కండేయస్వామి దేవాలయంలోనూ, తిరుమల అర్చక భవన్ లోనూ, విశాఖపట్నం
శ్రీ సిద్ధేశ్వరీపీఠంలోనూ, చెన్నై వరల్డ్ తెలుగు ఫెడరేషన్ కార్యాలయంలోనూ ఆవిష్కరణ జరుపుకుని పవిత్రంగా విజయఢంకా మ్రోగిస్తున్న పురాణపండ శ్రీనివాస్ అద్భుత రచనాసంకలనమైన శ్రీలలిత విష్ణు సహస్రనామ స్తోత్రమ్ గ్రంధం భీమవరంలో ఇలా పవిత్ర మంత్రమయ వేడుక జరుపుకోవడాన్ని భక్త జనులు అభినందిస్తున్నారు.
రాష్ట్ర దేవాదాయశాఖామంత్రి ఆనం రామనారాయణ రెడ్డిచే తొలుత ఆవిష్కరించబడిన ఈ శ్రీలలిత విష్ణు సహస్రనామ స్తోత్రమ్ గ్రంధం గత రెండువారాలుగా రాష్ట్రంలోని ఎన్నో ఆలయాల పండితుల, అర్చకుల కరదీపిక కావడం గమనార్హం.
ఇప్పటికే సుమారు డెబ్భై పై చిలుకు ఆర్షభారతీయ ధార్మిక గ్రంధాలను రచించి ప్రచురించి పీఠాధిపతులను, మఠాధిపతులను ఆశ్చర్యపరిచిన పురాణపండ మేధస్సు కేవలం తిరుమల శ్రీనివాసుని అఖండ అనుగ్రహమేనంటున్నారు తిరుమల ప్రధాన అర్చకులు ఏ. వేణు గోపాల దీక్షితులు.