Home » Sri Lalitha Vishnu Sahasranama Stotram
ఎన్నో సంవత్సరాలుగా ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ అపురూపమైన దివ్య గ్రంధాలు శ్రీ మావుళ్ళమ్మ తల్లి సన్నిధానానికి వచ్చి.. వేల భక్తుల్ని ఆకట్టుకుని, పారాయణా ప్రార్ధన గ్రంథాలుగా ఎందరి గడపలకో చేరుతున్నాయి. మళ్ళీ ఈ శ్రావణ మాసం తొలి శుక్రవారంనాడు ఈ పరమాద్భుత గ్రంధాన్ని ఆవిష్కరించడం కేవలం అమ్మవారి అనుగ్రహమేనన్నారు శ్రీమావుళ్ళమ్మ దేవస్థానం కార్యనిర్వహణాధికారి బుద్ధా మహాలక్ష్మీ నరేష్.
శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో ఇటీవల విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అత్యద్భుతంగా జరిగిన మహాసహస్రావధాని వద్దిపర్తి పద్మాకర్ ‘శ్రీదుర్గా వైభవం’ ఉపన్యాసాలలో, అనంతరం జరిగిన నృత్యవైభవాలలో ప్రముఖ రచయిత, శ్రీశైలదేవస్థానం ప్రత్యేకసలహాదారులు పురాణపండ శ్రీనివాస్ రచనా సంకలనం ‘శ్రీ లలిత విష్ణు సహస్ర నామస్తోత్రం’ గ్రంధాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.
మరికొన్ని రోజుల్లో శ్రావణ మాసం మొదలై కనకదుర్గమ్మ మరిన్ని మహోజ్వల కార్యాలు జరిపించుకోనున్న ఈ సందర్భంలో మరిన్ని గ్రంథావిష్కరణలు, ఉచిత వితరణలకు, మహాలక్ష్మీ ప్రదంగా జరుపనున్నట్లు సమాచారం. ఈ శ్రీవైభవానికి సహకరించి ప్రోత్సహించిన దేవాదాయ శాఖామంత్రి ఆనం రామనారాయణరెడ్డికి, దేవాదాయ శాఖ కమీషనర్ సత్యనారాయణ, మహోపన్యాసకులు చాగంటి కోటేశ్వర రావుకు, ‘సౌభాగ్య’ లక్షప్రతులు సమర్పించి పవిత్ర సంచలనం సృష్టించిన నిస్వార్ధ సేవకులు బొల్లినేని కృష్ణయ్యకు, నాలుగు గ్రంధాల ఆవిష్కరణకు కారణమైన అద్భుతమైన రచయిత పురాణపండ శ్రీనివాస్‌కు, దేవస్థానంలో అన్ని విభాగాల ఉద్యోగులకు ఈఓ రామారావు మనసారా కృతజ్ఞతలు తెలిపారు.
తెలుగు రాష్ట్రాలలో ప్రతిష్టాత్మక సాంస్కృతిక, సాహిత్య, ఆధ్యాత్మిక కార్యక్రమాల వేదికగా దశాబ్దాల ఖ్యాతిగాంచిన త్యాగరాయ గాన సభ.. కేంద్ర మంత్రులు జి. కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు అభినందలు తెలియజేస్తూ మహోజ్వలమైన మూడు వందల ముప్పై పేజీల ‘శ్రీ లలిత విష్ణు సహస్రనామ స్తోత్రమ్’ ఇరవై ఐదవ ప్రచురణతో వచ్చేవారం మంగళాశాసనాలు సమర్పిస్తోంది. భారతీయ జనతాపార్టీ మహిళామోర్చా, ఆరెస్సెస్ మహిళా సేవికా సమితిలకు ఈ గ్రంధం వందల సంఖ్యలో పంచనుంది. ఇప్పటికే సుమారు యాభై పై చిలుకుగా అపురూప ధార్మిక గ్రంధాలను కధలుగా, స్తోత్రాలుగా, వ్యాఖ్యానాలుగా తెలుగులోగిళ్ళకు అందించిన జ్ఞాన మహాయజ్ఞ కేంద్రం ప్రచురిస్తున్న ఈ గ్రంధాన్ని తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం పూర్వ వైస్ ఛాన్సలర్ ఆచార్య కొలకలూరి ఇనాక్ ప్రోత్సాహంతో గానసభ అధ్యక్షులు జనార్ధనమూర్తి సౌజన్యంతో అందుతోంది. ప్రముఖ రచయిత, శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారు పురాణపండ శ్రీనివాస్ అందించిన శ్రీవిద్యల రచనా సంకలనమే ‘శ్రీ లలిత విష్ణు సహస్రనామ స్తోత్రమ్’.
ప్రపంచం నుండి పరమాత్మవైపుకు మనస్సును మరల్చడమే దైవీయ చైతన్య గ్రంధాల లక్షణమని, మనిషిని సాధకునిగా, కార్య సాధకునిగా మార్చేది కేవలం స్తోత్ర మంత్ర సాహిత్యం మాత్రమేనని సీనియర్ ఐఏఎస్ అధికారి, తెలంగాణా ప్రభుత్వ పూర్వ అధికారి కెవి రమణాచారి పేర్కొన్నారు. ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ అపురూప రచనా సంకలనం శ్రీ లలితా విష్ణు సహస్రనామ స్తోత్రమ్ గ్రంధాన్ని శుక్రవారం రాత్రి హైదరాబాద్ త్యాగరాయగానసభలో ఆయన ఆవిష్కరించారు.
శివాజ్ఞ, శివానుగ్రహంతోనే ఈ జగత్తు నడుస్తుందని.. ‘ఆట కదరా శివా’తో లక్షలకొలదీ అభిమానుల్ని సంపాదించుకున్న విఖ్యాత రచయిత, ప్రముఖ నటులు తనికెళ్ళ భరణి గురువారం ఉదయం కుటుంబ సభ్యులతో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం భరణి దంపతులకు ఆలయ సంప్రదాయానుసారం వేదపండితులు ఆశీర్వచనం చేసి మన్త్రమయ జ్ఞాపికలుగా ప్రముఖ రచయిత, శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ అపురూప గ్రంధాలను అందజేశారు.