Share News

Gambling 15 మంది పేకాటరాయుళ్ల అరెస్టు

ABN , Publish Date - Dec 25 , 2024 | 12:18 AM

Gambling మండలంలోని వాండ్రంగి పంచా యతీ పరిధి చీడిపేట పాత బస్డాండ్‌ వద్ద పేకాట శిబిరంపై మంగళవారం పోలీసులు దాడి చేశారు. పేకాట ఆడుతున్న 15 మందిని అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ వై.మధుసూదన రావు తెలిపారు.

Gambling 15 మంది పేకాటరాయుళ్ల అరెస్టు

జి.సిగడాం, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): మండలంలోని వాండ్రంగి పంచా యతీ పరిధి చీడిపేట పాత బస్డాండ్‌ వద్ద పేకాట శిబిరంపై మంగళవారం పోలీసులు దాడి చేశారు. పేకాట ఆడుతున్న 15 మందిని అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ వై.మధుసూదన రావు తెలిపారు. జి.సిగడాం మండలంలోని మెట్టవలస, పొందూ రు, రాపాక గ్రామాలకు చెందిన 15 మంది నుంచి రూ.1,39,180 నగదు, 15 సెల్‌ ఫోన్లు, రెండు కార్లు, 11 మోటారు సైకిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

ఆదివారంపేటలో ఆరుగురు..

శ్రీకాకుళం క్రైమ్‌, డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళంలోని ఆదివారంపేట సమీపంలో ఆరుగురు పేకాటరాయుళ్లు పోలీసులకు పట్టుబడ్డారు. రెండో పట్టణ సీఐ పి.ఈశ్వరరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. ఆదివారం పేట సమీపంలో మంగళవారం రాత్రి ఆరుగురు పేకాట ఆడుతుండగా రెండో పట్టణ పోలీసులు దాడులు నిర్వహించారు. పట్టుబడిన వారి నుంచి రూ.9680 నగదు, మూడు బైక్‌లు, ఆరు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీరిపై సీఐ ఈశ్వరరావు కేసు నమోదు చేశారు.

21 మద్యంసీసాలు స్వాధీనం

బలగ మెట్టు జంక్షన్‌ వద్ద నర్రం శ్యామల నుంచి రూ.2530 విలువ చేసే 21 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. అనధికారికంగా మద్యం విక్రయిస్తుం డడంపై రెండో పట్టణ పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు దాడులు నిర్వహించారు. ఈ మేరకు ఆమెపై సీఐ కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

700 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం

సోంపేట, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): మందస మండలంలోని సవరమధ్య గ్రామంలో సారా తయారీకోసం ఉపయోగించే 700 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేసినట్లు ఎక్సైజ్‌ సీఐ కె.బేబీ తెలిపారు. కంచిలి మండలంలోని గోపికేళి వద్ద సారా తరలిస్తుండగా సిబ్బంది దాడులు చేశారని చెప్పారు.ఈ మేరకు ఏఎస్‌పల్లికి చెం దిన భీమారావు వాహనంతోపాటు 600 ప్యాకెట్ల సారాను విడిచిపెట్టి పారిపోయి నట్లు తెలిపారు. ఎక్సైజ్‌ స్టేషన్‌ పరిఽధిలో పాతకేసులకు సంబంధించి 11 మందిని తహసీల్దార్‌ ఎదుట బైండోవర్‌ చేసినట్లు చెప్పారు.

సారా తరలిస్తున్న మహిళపై కేసు

పాతపట్నం, డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోని పూతికగూడ గ్రామంలో సవర పార్వతి 2.5 లీటర్ల సారా తరలిస్తుండగా అదుపులోకి తీసుకు న్నట్లు ఎక్సైజ్‌ సీఐ కె.కృష్ణారావు తెలిపారు. ఆమెపై కేసు నమోదు చేసి మంగళ వారం నరసన్నపేట కోర్టులో హాజరుపరిచామన్నారు. జనవరి 3వ తేదీ వరకు రిమాండ్‌ విధించగా సబ్‌ జైలుకు తరలించామన్నారు.

Updated Date - Dec 25 , 2024 | 12:18 AM