Share News

ఎస్పీ గ్రీవెన్స్‌కు 16 వినతులు

ABN , Publish Date - Sep 20 , 2024 | 11:41 PM

కాశీబుగ్గ పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో శుక్రవారం ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ప్రజా సమస్యల పరిష్కారవేదికను నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు సమస్యలపై వినతి పత్రా లను అందించారు.

 ఎస్పీ గ్రీవెన్స్‌కు 16 వినతులు
ఎస్పీకి ఫిర్యాదు చేస్తున్న ఆశ కార్యకర్త, సీఐటీయూ నాయకులు

పలాస: కాశీబుగ్గ పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో శుక్రవారం ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ప్రజా సమస్యల పరిష్కారవేదికను నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు సమస్యలపై వినతి పత్రా లను అందించారు. మొత్తం 16 వినతులు రాగా వీటిలో సివిల్‌ 5, మిస్సింగ్‌ కేసు-1, పాత కేసులు- 3, ఇతర సమస్య లపై నాలుగు వినలులొచ్చాయి. తనకు ప్రాణహాని ఉందని పలాస మండలం కిష్టుపురానికి చెందిన ఆశ కార్యకర్త బి.కృష ్ణవేణి ఎస్పీకి విన్నవించారు. అదే గ్రామంలో అధికారపార్టీ నాయకులు తమపై దాడి చేశారని, ఎప్పటికప్పుడు గొడవలు సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె వెంట సీఐటీ యూ జిల్లా కార్యదర్శి ఎన్‌.గణపతి ఉన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజల సమస్యలు తెలుసుకుని, వాటిని పరిష్కరిస్తామని పేర్కొన్నారు.

నరసన్నపేట: స్థానిక పోలీస్‌ స్టేషన్‌ను ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి శుక్రవారం రాత్రి పరిశీలించారు. స్టేషన్‌ భవనాల నిర్మాణానికి చర్యలు తీసుకుం టానన్నారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన పట్ట ణంలోని గొడగల వీధికి చెందిన వృద్ధురాలిని ఎస్పీ పలకరించి సమస్య ను అడిగి తెలుసుకున్నారు. తన కుమార్తె సరిగా చూడడం లేదని ఆమె ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. కార్యక్రమంలో సీఐ శ్రీనివాస రావు ఎస్‌ఐ దుర్గాప్రసాద్‌ ఉన్నారు.

Updated Date - Sep 20 , 2024 | 11:41 PM