తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి
ABN , Publish Date - Jun 28 , 2024 | 11:25 PM
తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించాలని గ్రా మీణ నీటి సరఫరా విభాగం అధికారు లను ఎమ్మెల్యే గొం డు శంకర్ ఆదేశిం చారు.
అరసవల్లి: తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించాలని గ్రా మీణ నీటి సరఫరా విభాగం అధికారు లను ఎమ్మెల్యే గొం డు శంకర్ ఆదేశిం చారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటిం టికీ కొళాయి సదుపాయం కల్పించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. శుక్రవారం స్థానిక నీటి సరఫరా విభాగం కార్యాలయంలో అధికారులతో ఎమ్మెల్యే శంకర్ సమీక్ష నిర్వహించారు. తాగునీటి సరఫరాలో తలెత్తుతున్న సమస్యలపై చర్చించారు. మరమ్మతులకు సంబంధించి నివేదికలు ఇస్తే.. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి నిధులు మంజూరు చేయిస్తానన్నారు. తాగునీటి సమస్యతో నియోజక వర్గ ప్రజలు ఇబ్బందిపడే పరిస్థితి ఉండకూడదన్నారు. ఈ సందర్భంగా తన దృష్టికి వచ్చిన పలు సమస్యలను అధికారులకు వివరించి పరిష్కరించాలని కోరా రు. వచ్చే వేసవి నాటికి రూరల్ ప్రాంతంలో నీటి ఎద్దడి లేకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. సమావేశంలో గ్రామీణ నీటి సరఫరా విభాగం ఎస్‌ఈ జాన్ బెన్‌హర్, డీఈలు సీహెచ్ రామారావు, పి.శంకరరావు ఇతర అధికారులు పాల్గొన్నారు.