Share News

ఆటో ఎక్కుతూ జారిపడి వ్యక్తి మృతి

ABN , Publish Date - May 15 , 2024 | 11:51 PM

నగరంలో ఓ వ్యక్తి ఆటో ఎక్కుతూ జారిపడి మృతి చెందాడు. ట్రాఫిక్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... స్థానిక చిన్నమండల వీధికి చెందిన తోట శ్రీనివాసరావు(46) పెయింటింగ్‌ పనులు చేస్తూ జీవిస్తున్నాడు.

ఆటో ఎక్కుతూ జారిపడి వ్యక్తి మృతి

శ్రీకాకుళం క్రైం: నగరంలో ఓ వ్యక్తి ఆటో ఎక్కుతూ జారిపడి మృతి చెందాడు. ట్రాఫిక్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... స్థానిక చిన్నమండల వీధికి చెందిన తోట శ్రీనివాసరావు(46) పెయింటింగ్‌ పనులు చేస్తూ జీవిస్తున్నాడు. సరుబుజ్జిలిలో కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు తన చెల్లెలుతో బయలుదేరాడు. సూర్య మహల్‌ కూడలిలో ఆటో ఎక్కుతుండగా డ్రైవర్‌ అజాగ్రత్తగా శ్రీనివాసరావు ఎక్కు తుండగా ఆటో తీసేశాడు. దీంతో పడిపోయిన శ్రీనివాసరావు తల రోడ్డును బలంగా గు ద్దుకుంది. వెంటనే శ్రీనివాసరావును జెమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శ్రీనివాసరావు మృతి చెందాడు. ట్రాఫిక్‌ ఎస్‌ఐ ప్రసాదరావు కేసు నమోదు చేశారు.

Updated Date - May 15 , 2024 | 11:51 PM