Share News

అట్రాసిటీ కేసులో ముద్దాయికి రెండేళ్లు జైలుశిక్ష

ABN , Publish Date - Dec 02 , 2024 | 11:40 PM

పాతపట్నంలోని యశోదానగర్‌లో రెండిళ్ల మధ్య ఉన్న పిట్ట గోడపై పూలమొక్కల ఉంచిన నేపథ్యంలో ఇరువురి మధ్య జరిగిన వివాదంలో నిందితురాలు గేదెల అమరావతిపై అట్రాసిటీ కేసు రుజువు కావడంతో రెండేళ్ల జైలుశిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ శ్రీకాకుళం ఎస్సీ, ఎస్టీ నాలుగో అదనపు కోర్టు న్యాయాధికారి ఫణికుమార్‌ సోమవారం తీర్పు ఇచ్చినట్లు ఎస్‌ఐ లావణ్య తెలిపారు.

అట్రాసిటీ కేసులో ముద్దాయికి రెండేళ్లు జైలుశిక్ష

పాతపట్నం/అరసవల్లి, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): పాత పట్నంలోని యశోదానగర్‌లో రెండిళ్ల మధ్య ఉన్న పిట్ట గోడపై పూలమొక్కల ఉంచిన నేపథ్యంలో ఇరువురి మధ్య జరిగిన వివాదంలో నిందితురాలు గేదెల అమరావతిపై అట్రాసిటీ కేసు రుజువు కావడంతో రెండేళ్ల జైలుశిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ శ్రీకాకుళం ఎస్సీ, ఎస్టీ నాలుగో అదనపు కోర్టు న్యాయాధికారి ఫణికుమార్‌ సోమవారం తీర్పు ఇచ్చినట్లు ఎస్‌ఐ లావణ్య తెలిపారు. ఆమె తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పాతపట్నంలోని యశోదానగర్‌లో పి.చిన్నమ్మడు నివాసం ఉంటుండగా.. తూర్పు వైపు గేదెల అమరావతి కుటుంబంతో కలిసి రెండో అంతస్థుల ఇంటిలో ఉంటోంది. వీరి ఇళ్లకు మధ్య పిట్టగోడపై అమరావతి పూలమొక్కలను పెంచుతోంది. మొక్కలకు నీరు పోసే సమయంలో ఆ నీరు చిన్నమ్మడు ఉంచిన ధాన్యం, బట్టలపై పడి తడిచిపోతుండేవి. ఈ విషయం సదరు అమరావతిని అడుగ్గా నాఇష్టం ఈ గోడపై మొక్కలు పెట్టుకుంటానంటూ చిన్నమ్మడును కులం పేరుతో దూషించడంతో చిన్నమ్మడు భర్త ఇంటిలోకి తీసుకువెళ్లి పోయాడు. ఈ నేపథ్యంలో మొక్కలకు పోసిన నీరు తన ఇంటిలోకి రాకుండా చిన్న మ్మడు గట్టును నిర్మించింది. అయితే ఆ గట్టును అమరావతి 2020 ఫిబ్రవరి 24న విరగ్గొడుతుండగా చిన్నమ్మడు ప్రశ్నిం చింది. ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య గొడవ జరిగింది. దీంతో అమరావతి చిన్నమ్మడును కులంపేరుతో దూషిం చడంతో పాటు నీళ్లను ఆమె ముఖంపై పోసింది. పూల కుండీని విసిరివేయడంతో చేతితో అడ్డుకునేందుకు చిన్న మ్మడు ప్రయత్నించగా తీవ్రంగా గాయమైంది. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్‌ఐ టి.రాజేష్‌ కేసు నమోదు చేశారు. దీనిపై ట్రాఫిక్‌ డీఎస్పీ సీహెచ్‌జీవీ ప్రసాదరావు దర్యాప్తు చేశారు. ఈ నేపథ్యంలో నిందితురాలు అమరావతి పై కేసు రుజువు కావడంతో న్యాయాధికారి తుది తీర్పును ఇచ్చారు. నిందితురాలికి రెండేళ్లు జైలు శిక్ష, రూ.10 వేల జరి మానా విధిస్తూ తీర్పు చెప్పారు. జరిమానా కట్టనిచో మరో మూడు నెలలు సాధారణ జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుం దని ఆ తీర్పులో పొందుపరిచారు. ఈ కేసుకు స్పెషల్‌ పీపీ వి.రఘురాం వాదించారు.

Updated Date - Dec 02 , 2024 | 11:40 PM