Share News

దొంగతనం కేసులో నిందితులకు రెండేళ్ల జైలు

ABN , Publish Date - Nov 20 , 2024 | 11:32 PM

మండ లంలోని మునసబుపేటకు చెందిన వడ్డి రాజేశ్వరి ఇంట్లో 2021 అక్టోబరు పదో తేదీన జరిగిన దొంగతనం కేసులో నిందితులకు జైలు శిక్ష విధించినట్లు రూరల్‌ ఎస్‌ఐ కె.రాము బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

దొంగతనం కేసులో నిందితులకు రెండేళ్ల జైలు

శ్రీకాకుళం రూరల్‌, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): మండ లంలోని మునసబుపేటకు చెందిన వడ్డి రాజేశ్వరి ఇంట్లో 2021 అక్టోబరు పదో తేదీన జరిగిన దొంగతనం కేసులో నిందితులకు జైలు శిక్ష విధించినట్లు రూరల్‌ ఎస్‌ఐ కె.రాము బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కేసులో ఇచ్ఛాపురం మండలంలోని తేలుకుంచికి చెందిన కొయ్య పాపారావు, మద్ది పరుశురాం లను 2021 అక్టోబరు 29న అరెస్టు చేసి రూరల్‌ పోలీసులు కోర్టులో హాజరుపరిచినట్లు చెప్పారు. ఈ మేరకు నిందితులకు శ్రీకాకుళంలోని ఒకటో అదనపు జుడిషియల్‌ మెజిస్ర్టేట్‌ కోర్టు న్యాయాధికారి రెండేళ్లు జైలు శిక్షతో పాటు రూ.5వేల అపరాధ రుసుము విధించినట్లు తెలిపారు. అపరాధ రుసుం చెల్లించని పక్షంలో అదనంగా నెల రోజుల సాధారణ జైలు శిక్ష విధించినట్లు ఎస్‌ఐ రాము పేర్కొన్నారు.

తల్లి, చెల్లిపై దాడి

వజ్రపుకొత్తూరు, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): భూముల విషయమై సోదరి, సోదరుల మధ్య కొన్ని రోజులుగా తగాదాలు జరుగుతున్న నేపథ్యంలో కుమారుడు దానేసు తల్లి దూగాన లక్ష్మమ్మ, చెల్లి రెల్ల హేమలతపై దాడి చేసి గాయపరిచిన ఘటన బుధవారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. వరి పంట కోతకు సిద్ధమవగా పంట విషయమై మరోమారు పొలంలోనే చెల్లి అన్నదమ్ముడి మధ్య గొడవ చోటు చేసుకుంది. ఈ క్రమంలో జరిగిన వివాదంలో కర్రతో తల్లి, చెల్లిపై దాడి చేసినట్లు సమాచారం. వెంటనే క్షతగాత్రులను స్థానికులు పలాస ప్రభుత్వాసు పత్రికి తర లించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై ఎస్‌ఐ నీహార్‌ను ప్రశ్నించగా ఫిర్యాదు వచ్చిందని, వివరాలు సేకరిస్తున్నామని చెప్పారు.

Updated Date - Nov 20 , 2024 | 11:32 PM