Share News

కేంద్రాల నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు

ABN , Publish Date - Dec 07 , 2024 | 12:26 AM

చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాల నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తప్ప వని జిల్లా పంచాయతీ అధికారి కె.సౌజన్య భారతి హెచ్చరించారు.

కేంద్రాల నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు
రికార్డులు పరిశీలిస్తున్న డీపీవో సౌజన్య భారతి

జి.సిగడాం, డిసెంబరు 6(ఆం ధ్రజ్యోతి): చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాల నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తప్ప వని జిల్లా పంచాయతీ అధికారి కె.సౌజన్య భారతి హెచ్చరించారు. శుక్రవారం ఎందువ, జి.సిగడాం తదితర గ్రామాల్లో చెత్తసంపద కేంద్రాలను పరిశీలించారు. తడి, పొడి చెత్తలను వేరుచేసి కేంద్రాలకు తరిలించాలన్నా రు. అనంతరం స్థానిక ఎంపీడీవో కార్యాలయం లో అధికారులతో సమీక్షించారు. డీపీఆర్‌సీ జిల్లా కో-ఆర్డినేటర్‌ కె.నిశ్చల, ఎంపీడీవో టి.రా మకృష్ణ, సర్పంచ్‌ అల్లు జోగినాయుడు, పంచా యతీ కార్యదర్శిలు పొట్నూరు సురేష్‌, సాహు, సతీష్‌, పోగిరి రాము, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 07 , 2024 | 12:26 AM