Share News

అంటరానితనంపై అంబేడ్కర్‌ అలుపెరుగని పోరాటం

ABN , Publish Date - Dec 07 , 2024 | 12:21 AM

నాటి సమాజంలో ఉన్న వివక్షను రూపుమాపేందుకు అంబేడ్కర్‌ చేసిన అలుపెరుగని పోరాటం మరువలేనిదని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అన్నారు.

అంటరానితనంపై అంబేడ్కర్‌ అలుపెరుగని పోరాటం
గుజరాతీపేట: అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న కలెక్టర్‌ పుండ్కర్‌

గుజరాతీపేట, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): నాటి సమాజంలో ఉన్న వివక్షను రూపుమాపేందుకు అంబేడ్కర్‌ చేసిన అలుపెరుగని పోరాటం మరువలేనిదని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ వర్థంతి సందర్భంగా శుక్రవారం నగరం లోని అంబేడ్కర్‌ కూడలి వద్ద ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి కలెక్టర్‌ మాట్లాడారు. కార్యక్రమంలో సాంఘిక సంక్షేమశాఖ ఉప సం చాలకులు విశ్వమోహన్‌ రెడ్డి, దళిత సంఘ నాయ కులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అలాగే అంబేడ్కర్‌ కూడలిలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌, రిమ్స్‌లో సూపరింటెండెంట్‌ షకీలా, డీడీ సీహెచ్‌ శ్రీనివాస్‌, జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ మహేశ్వర రెడ్డి, ఆమదాలవలసలో ఎమ్మెల్యే కూన రవికుమార్‌, పలాసలో ఎమ్మెల్యే గౌతు శిరీష, ఎచ్చెర్లలోని అంబేడ్కర్‌ యూని వర్సిటీలో వీసీ రజని అంబేడ్కర్‌ విగ్రహాలు , చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అలాగే జిల్లా వ్యాప్తంగా అంబే డ్కర్‌ వర్ధంతిని పలు సంఘాలు, కార్యాలయాల్లో నిర్వహించారు. కార్యక్రమాల్లో వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Dec 07 , 2024 | 12:21 AM