airport శివరామపురంలో ఎయిర్ పోర్టు నిర్మించాలి
ABN , Publish Date - Dec 25 , 2024 | 12:15 AM
airport ఉద్దానంలో ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేయడం వల్ల నష్టమే తప్ప లాభం లేదని, నగరంపల్లి పంచాయతీ శివరామపురం ప్రాంతంలో ఉన ్న 1,850 ఎకరాల ప్రభుత్వ స్థలంలో ఎయిర్‌పోర్టు నిర్మిస్తే పైసా ఖర్చు లేకుండా పనులవుతాయని మాజీ మంత్రి డా.సీదిరి అప్పలరాజు అన్నారు.
అలా అయితే కేంద్రమంత్రికి ప్రచారం చేస్తా
పలాస, డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి): ఉద్దానంలో ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేయడం వల్ల నష్టమే తప్ప లాభం లేదని, నగరంపల్లి పంచాయతీ శివరామపురం ప్రాంతంలో ఉన ్న 1,850 ఎకరాల ప్రభుత్వ స్థలంలో ఎయిర్‌పోర్టు నిర్మిస్తే పైసా ఖర్చు లేకుండా పనులవుతాయని మాజీ మంత్రి డా.సీదిరి అప్పలరాజు అన్నారు. మంగళవారం తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. శివరామపురంలో ఎయిర్‌పోర్టు నిర్మించేందుకు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు చర్యలు తీసుకుంటే తాను విమర్శించిన చోటే ఆ గ్రామాల్లో గజ్జెకట్టుకుని ఆయన కోసం ప్రచారం చేస్తాన న్నారు. ఎయిర్‌పోర్టు కావాలి, ఉద్దానం ప్రజల మనోభావాలు గౌరవించాలని కోరా రు. ఉద్దానం గుండె కాయ రామ్‌పురం గ్రామంలో విలువైన జిరాయతీ భూము లున్నాయని, అటువంటి భూముల్లో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి స్థల సేకరణ చేయ డంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజలతో చర్చించకుండా, వారి మనోభావా లను గుర్తించకుండా స్థల సేకరణ చేయడం ఏమిటని ప్రశ్నించారు. టీడీపీ నేత బడ్డ నాగరాజు హత్యకు జరిగిన కుట్రపై విలేకరులు వేసిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. హత్యా రాజకీయాలకు తాను దూరమని, పోలీస్ స్టేషన్‌లో తమ నాయకులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. పోలీస్ స్టేషన్‌లోనే తమ వారిపై దాడి జరిగినా తిరిగి ఎదురు కేసులు పెట్టడాన్ని తప్పుబట్టారు.