Share News

మనస్తాపంతో వృద్ధుడి ఆత్మహత్య

ABN , Publish Date - Sep 16 , 2024 | 12:26 AM

మండలంలోని బిట్‌-3 ఇరపాడు గ్రామంలో ఆదివారం ఓ వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

మనస్తాపంతో వృద్ధుడి ఆత్మహత్య

కొత్తూరు: మండలంలోని బిట్‌-3 ఇరపాడు గ్రామంలో ఆదివారం ఓ వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. కరణం దాసు(70) దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఎంతకీ ఆరోగ్యం కుదుటపడకపోవడంతో మనస్తాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దాసుకి భార్యతో పాటు నలుగురు కుమారులు, కుమార్తె ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ ఎంఏ అహ్మద్‌ తెలిపారు.

గుర్తుతెలియని వ్యక్తి మృతి

శ్రీకాకుళం క్రైం: స్థానిక పాత బస్టాం డ్‌ సమీపంలో ఆదివారం మధ్యాహ్నం గుర్తుతెలియని వ్యక్తి మృతిచెం దాడు. ఈ మేరకు స్థానికులు 1వ పట్టణ పోలీసులకు స మాచారం అందించడంతో ఎస్‌ఐ హరికృష్ణ ఘటనా స్థలా నికి చేరుకుని మృతుడి వివరాలు సేకరించారు. అయితే గడచిన మూడు నెలలుగా ఇదే ప్రాంతంలో ఆ వ్యక్తి భిక్షాటన చేస్తున్నట్టు స్థానికులు ఎస్‌ఐకు తెలిపారు. మృతుడి వయసు 45 నుంచి 50 మధ్య ఉంటుందని, వివరాలు తెలిసిన వారు వన్‌ టౌన్‌ పోలీసులను సంప్రదించాలని కోరారు. పోలీసులకు సమా చారం అందించిన వడ్డి మోహనరావు ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ కేసు నమోదు చేసి, మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించారు.

Updated Date - Sep 16 , 2024 | 12:26 AM