Armored: పకడ్బందీగా దేహదారుఢ్య పరీక్షలు: ఎస్పీ
ABN , Publish Date - Dec 29 , 2024 | 12:05 AM
Armored పోలీ సు కానిస్టేబుల్ నియా మక ప్రక్రియలో భాగం గా ఈ నెల 30వ తేదీ నుంచి ఎచ్చెర్ల సాయుధ పోలీసు మైదానంలో దే హదారుఢ్య పరీక్షలను పకడ్బంధీగా నిర్వహించ నున్నట్టు ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి తెలిపారు.
ఎచ్చెర్ల, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): పోలీ సు కానిస్టేబుల్ నియా మక ప్రక్రియలో భాగం గా ఈ నెల 30వ తేదీ నుంచి ఎచ్చెర్ల సాయుధ పోలీసు మైదానంలో దే హదారుఢ్య పరీక్షలను పకడ్బంధీగా నిర్వహించ నున్నట్టు ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి తెలిపారు. సాయుధ మైదానాన్ని శనివారం సందర్శించి ఏర్పాట్లను పరిశీలించిన ఆయన పలు సూచనలు చేశారు. ప్రాథమిక రాత పరీక్షలో 7,390 మంది ఉత్తీర్ణులయ్యారని, ఇందులో 1,175 మంది మహిళలు, 6,215 మంది పురుషులని చె ప్పారు. వచ్చే నెల 18వ తేదీ వరకు దేహదారుఢ్య పరీక్షలు చేపట్టనున్నట్టు తెలిపారు. ఫిజి కల్ మెజర్‌మెంట్స్, ఎఫిషియన్సీ పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. అత్యాధు నిక సాంకేతిక పరిజ్ఞానంతోపాటు సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఈ ఎంపికలు చేపడుతు న్నామన్నారు. వైద్య శిబిరాన్ని, అంబులెన్స్‌ను అందుబాటులో ఉంచుతామన్నారు. ఈ ఎంపిక లకు సంబంధించి సూచిక బోర్డులు ఏర్పాటు చేశామన్నారు. అభ్యర్థులు కాల్ లెటర్‌లో సూ చించిన విధంగా ఒరిజనల్ ధ్రువ పత్రాలతోపాటు ఒక సెట్ అటెస్టెడ్ జెరాక్స్ కాపీలు, ప్రాథమిక పరీక్షలో ఉత్తీర్ణులైన కాఫీని తప్పనిసరిగా తీసుకురావాలన్నారు. సెల్ ఫోన్లు, ఇతర ఎలకా్ట్రనిక్ పరికరాలు తీసుకురావద్దన్నారు. దళారీలను నమ్మి మోసపోవద్దన్నారు. అట్టి వ్యక్తు లు తారసపడతే 63099 90800, 63099 90911 ఫోన్ నెంబర్లకు సమాచారం ఇవ్వాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ కేవీ రమణ, డీఎస్పీలు అప్పారావు, మూర్తి, ప్రసాదరావు, శేషాద్రి, రాంబాబు, శివరామిరెడ్డి, ఏవో గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు.