బ్యాడ్మింటన్ విజేత అభిరామ్
ABN , Publish Date - Jul 14 , 2024 | 11:22 PM
స్థానిక శాంతినగర్ కాలనీలోని ఇండోర్ స్టేడియంలో గత రెండు రోజులుగా జరుగుతున్న జిల్లాస్థాయి బ్యాడ్మిం టన్ చాంపియన్‌షిప్ ఆదివారంతో ముగిసిం ది.
-ముగిసిన జిల్లాస్థాయి పోటీలు
శ్రీకాకుళం స్పో ర్ట్స్: స్థానిక శాంతినగర్ కాలనీలోని ఇండోర్ స్టేడియంలో గత రెండు రోజులుగా జరుగుతున్న జిల్లాస్థాయి బ్యాడ్మిం టన్ చాంపియన్‌షిప్ ఆదివారంతో ముగిసిం ది. బ్యాడ్మింటన్ మెన్ చాంపియన్‌గా ఎ.అభిరా మ్, రన్నరప్‌గా కె.సాయి కుమార్ నిలిచారు. డబుల్స్ విభాగంలో విన్నర్‌గా ఎం.అభిరామ్, కె.సాయికుమార్, రన్నరప్‌గా పిజి.సాయిదత్త, భరద్వాజ్ చౌదరి నిలిచారు. గెలుపొందిన క్రీడాకారుల కు ఆదివారం జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలను జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అ ధ్యక్షులు కిల్లంశెట్టి సాగర్ అందజేశారు. జిల్లా ఒలింపిక్ సంఘం కార్యదర్శి ఎం.సాం బమూర్తి, బ్యాడ్మింటన్ సంఘం ప్రతినిధులు బైరి దామోదర్, ఎం.అశోక్ కుమార్, టి.జయరామ్, కేఎస్‌ఎం.శైలాని, రత్నాజి. కె.తారకేశ్వరరావు, జి.అనిల్‌కుమార్, సీఈవో ఎస్.సూరిబాబు, డీఎస్‌ఏ శిక్షకులు హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.