Share News

డీఎంహెచ్‌వోగా బాలమురళీకృష్ణ

ABN , Publish Date - Dec 22 , 2024 | 12:16 AM

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్‌వో)గా డాక్టర్‌ టీవీ బాలమురళీకృష్ణ నియమితులయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల డీఎంహెచ్‌వోలను ప్రభుత్వం శనివారం బదిలీచేసింది.

డీఎంహెచ్‌వోగా బాలమురళీకృష్ణ

- విశాఖకు మీనాక్షి బదిలీ

శ్రీకాకుళం, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్‌వో)గా డాక్టర్‌ టీవీ బాలమురళీకృష్ణ నియమితులయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల డీఎంహెచ్‌వోలను ప్రభుత్వం శనివారం బదిలీ చేసింది. ఆయా స్థానాల్లో డిప్యూటీ సివిల్‌ సర్జన్లకు ప్రమోషన్‌ కల్పిస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులను విడుదల చేసింది. ఇందులో భాగంగా కర్నూలు జిల్లా బడినేహల్‌ పీహెచ్‌సీ వైద్యులు టీవీ బాలమురళీకృష్ణ (డిప్యూటీ సివిల్‌ సర్జన్‌)ను ప్రమోషన్‌పై శ్రీకాకుళం డీఎంహెచ్‌వోగా నియమితులయ్యారు. ఇక్కడ విధులు నిర్వహించిన డాక్టర్‌ బొడ్డేపల్లి మీనాక్షిని విశాఖ ఆర్‌టీసీ(మేల్‌) విభాగానికి ప్రిన్సిపాల్‌గా బదిలీఅయ్యారు. అలాగే కాకినాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి డీసీఎస్‌ఆర్‌ఎంవోగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్‌ కె.అనిత.. బదిలీపై శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్‌)కు సీఎస్‌ఆర్‌ఎంవోగా ప్రమోషన్‌పై ఇక్కడకు వస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ ఎం.శ్రీహరిబాబు ప్రమోషన్‌పై పలాస కిడ్నీ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ అండ్‌ డయాల్సిస్‌ యూనిట్‌కు సీఎస్‌ఆర్‌ఎంవోగా నియమితులయ్యారు. ఈమేరకు రాష్ట్ర వైద్యఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ ప్రభుత్వ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి ఎంటీ కృష్ణబాబు శనివారం సాయంత్రం ఉత్తర్వులను జారీచేశారు.

Updated Date - Dec 22 , 2024 | 12:16 AM