నేడు జిల్లాకు చంద్రబాబు రాక
ABN , Publish Date - Apr 23 , 2024 | 12:41 AM
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం శ్రీకాకుళం జిల్లాకు రానున్నారు. పాతపట్నం, ఆమదాలవలసలో ప్రజాగళం సభలు నిర్వహించనున్నారు.
- పాతపట్నం, ఆమదాలవలసలో ప్రజాగళం సభలు
- రేపు మహిళామణులతో సమావేశం
(ఆంధ్రజ్యోతి-శ్రీకాకుళం)
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం శ్రీకాకుళం జిల్లాకు రానున్నారు. పాతపట్నం, ఆమదాలవలసలో ప్రజాగళం సభలు నిర్వహించనున్నారు. మంగళవారం ఉదయం విజయనగరం జిల్లా గజపతినగరంలో మహిళామణులతో సమావేశం అనంతరం శ్రీకాకుళం జిల్లాకు హెలీకాఫ్టర్‌లో చేరుకుంటారు. మధ్యాహ్నం 2.45 గంటలకు పాతపట్నంలో నీలమణి దుర్గా మాత ఆలయం వద్ద శ్రీశ్రీనివాస నగర్‌లో హెలీప్యాడ్‌లో దిగుతారు. అక్కడ నుంచి 2.55 గంటలకు రోడ్డు మార్గంలో బస్టాండ్‌కు చేరుకుంటారు. మూడు గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ప్రజలతో పాతపట్నంలో బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం హెలీకాఫ్టర్‌లో బయలుదేరి ఆమదాలవలస మండలం తిమ్మాపురంలో సెయింట్ ఆన్స్ హైస్కూల్ మైదానంలో హెలీప్యాడ్‌లో సాయంత్రం 5.05 గంటలకు దిగుతారు. 5.15 గంటలకు ఆమదాలవలసలో కృష్ణాపురం జంక్షన్‌కు చేరుకుంటారు. అక్కడ రాత్రి 6 గంటల నుంచి 7.30 గంటల వరకు ప్రజాగళం సభలో ప్రసంగిస్తారు. అనంతరం రోడ్డు మార్గంలో బయలుదేరి శ్రీకాకుళంలో జిల్లా టీడీపీ కార్యాలయానికి రాత్రి 8.10 గంటలకు చేరుకుంటారు. ఇక్కడ బుధవారం ఉదయం 11 గంటలకు జిల్లాలో మహిళామణులతో సమావేశమై మాట్లాడతారు. అనంతరం హెలీకాఫ్టర్‌లో బయలుదేరి విజయనగరం జిల్లాకు వెళ్తారు.