సూపర్ సిక్స్ అమలే చంద్రబాబు లక్ష్యం
ABN , Publish Date - Dec 01 , 2024 | 12:31 AM
ఎన్నికల హామీల్లో ప్రజలకు ఇచ్చిన సూపర్‌సిక్స్ పథకాలు అమలు చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పనిచేస్తున్నారని ఎమ్మెల్యే రవికుమార్ అన్నారు.
- ఒక్కరోజు ముందుగానే సామాజిక పింఛన్ల పంపిణీ
- జిల్లా వ్యాప్తంగా పండగ వాతావరణం
ఆమదాలవలస, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): ఎన్నికల హామీల్లో ప్రజలకు ఇచ్చిన సూపర్‌సిక్స్ పథకాలు అమలు చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పనిచేస్తున్నారని ఎమ్మెల్యే రవికుమార్ అన్నారు. శనివారం తోటాడ గ్రామంలో పింఛన్ల పంపిణీ చేశారు. రవికుమార్ మాట్లాడుతూ.. త్వరలో అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు, పింఛన్లు అందిస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో రోణంకి వెంకటరావు, గ్రామ సచివాలయ ఉద్యోగులు, మండల టీడీపీ నాయకు లు మనుమంతు బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కాగా ఎమ్మెల్యే రవికుమార్ ఇటీవల నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో వివిధ కారణాలతో మృతి చెందినవారి కుటుంబాలను శనివారం పరామర్శిం చారు. సుమారు 35 కుటుబాలను శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పరామర్శించారు.
కొత్త పింఛన్లు పంపిణీ
ఇచ్ఛాపురం/కవిటి, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): ఇచ్చాపురం మండ లం ఈదుపురం గ్రామంలో గత నెలలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సమయంలో ఇచ్చిన హామీమేరకు కొత్తగా పింఛన్లు మంజూ రు చేసినట్టు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బెందాళం అశోక్ అన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద శనివారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అలాగే కవిటి గ్రామానికి చెందిన కిడ్నీరోగులకు మంజూరైన పింఛన్లు అందించారు. కార్యక్రమంలో ఇచ్ఛాపురం మాజీ ఎంపీపీ డి.ఢిల్లీరావు, కవిటి నేతలు బి.రమేష్, ఎ.మధు, టి.మోహన రావు, బి.కామరాజు తదితరులు పాల్గొన్నారు.
పేదల సాధికారితే ప్రభుత్వ ధ్యేయం
రణస్థలం, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): సమాజంలోని బలహీన వర్గాల సాధికారతకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయు డు అన్నారు. ఒక్క రోజు ముందుగానే సామాజిక పింఛన్ పంపిణీ కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. ఇందులో భాగంగా శనివా రం పతివాడ పాలెం గ్రామంలో లబ్ధిదారులకు పింఛన్లు అందించారు. కార్యక్రమంలో టీడీపీ నేత పిసిని జగన్నాథంనాయుడు, పెంటన్నా యుడు, గొర్ల సాయి తదితరులు ఉన్నారు.
మూడు నెలలకోసారి తీసుకోవచ్చు..
కొత్తూరు, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): వసపలో లబ్ధిదారులకు పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పింఛన్లు అందజేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మూడు నెలలకు ఒకసారి పింఛన్ తీసుకొ నే విధానాన్ని కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టడం గొప్ప విషయమన్నా రు. కూటమి నాయకులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
కేదారిపురంలో..
పలాస రూరల్, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని, దీనిలో భాగంగానే ఒకటో తేదీ సెలవు కావడంతో ముందుగానే పెన్షన్ల పంపి ణీ చేశామని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. పలాస మండలంలోని కేదారిపురంలో పింఛన్లు పంపిణీ చేశారు. ఏపీ ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ వజ్జ బాబూరావు, టీడీపీ జిల్లా జిల్లా ప్రధాన కార్యదర్శి పి.విఠల్, టీడీపీ మండలాధ్యక్షుడు కుత్తుమ లక్ష్మణ్‌కుమార్, ఎంపీడీవో వసంతకుమార్, ఏపీఎం జాంభవతి పాల్గొన్నారు.
అర్హులందరికీ పింఛన్లు
పోలాకి, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): అర్హులందరికీ పింఛన్లు పంపిణీ చేస్తామని నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గురమణమూర్తి తెలిపారు మబగాం పంచాయతీ పరిధిలోని గజపతినగరం గ్రామంలో లబ్ధిదారులకు పింఛన్ డబ్బులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో గరిమెళ్ల వెంకట రవికుమార్, టీడీపీ నాయకులు ఎంవీ నాయుడు, కాయ రవి, తెలుగు నాగేశ్వరరావు, పావని పాల్గొన్నారు.
శ్రీకాకుళం నగరంలో...
అరసవల్లి, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): నగర పరిధి రెండో డివిజన్ లో టీడీపీ ఇన్‌చార్జి అక్కేన రాజారావు ఆధ్వర్యంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు పీఎంజే బాబు పింఛన్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సచివాలయ అడ్మిన్ స్వరూప్, ధర్మారావు, నాని, రమణ, తదితరులు పాల్గొన్నారు. 34వ డివిజన్‌లో పార్టీ ఇన్‌చార్జి చిట్టిబాబు ఆధ్వర్యంలో పార్టీ నగర అధ్యక్షుడు మాదారపు వేంకటేష్ చేతుల మీదుగా జెండాల వీధిలో గల కిడ్నీ బాధితులకు, మానసిక వికలాంగులకు పింఛన్ అందించారు. అలాగే 39వ డివిజన్, దమ్మలవీధిలో పార్టీ ఇన్‌చార్జి కేశవ రాంబాబు ఆధ్వర్యంలో పింఛన్ల పంపిణీ చేపట్టారు.