Share News

న్యాయ చట్టాల్లో మార్పులు అనివార్యం

ABN , Publish Date - Dec 03 , 2024 | 12:07 AM

సమాజ శ్రేయస్సు, దేశ భద్రత కోసం న్యాయచట్టాల్లో మార్పులు అనివార్యమయ్యాయని దామోదర సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం (డీఎస్‌ఎన్‌ఎల్‌యూ) వీసీ ప్రొఫెసర్‌ డి.సూర్యప్రకాశరావు తెలిపారు.

న్యాయ చట్టాల్లో మార్పులు అనివార్యం
మాట్లాడుతున్న సూర్యప్రకాశరావు

ఎచ్చెర్ల, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): సమాజ శ్రేయస్సు, దేశ భద్రత కోసం న్యాయచట్టాల్లో మార్పులు అనివార్యమయ్యాయని దామోదర సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం (డీఎస్‌ఎన్‌ఎల్‌యూ) వీసీ ప్రొఫెసర్‌ డి.సూర్యప్రకాశరావు తెలిపారు. సోమవారం ఎచ్చెర్లలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీలో క్రిమినల్‌ జస్టిస్‌ లా అండ్‌ రీసెంట్‌ ట్రెండ్స్‌ అన్న అంశంపై ఆయన మాట్లాడారు. బ్రిటీష్‌ కాలంనాటి పలు చట్టాల్లో స్పల్ప మార్పులు చేసి ప్రజలకు సరైన న్యాయం అందేలా నూతన చట్టాలను పార్లమెంటు ఇటీవల ఆమోదించిందని తెలిపారు. కార్యక్రమంలో వర్సిటీ రెక్టార్‌ ప్రొఫెసర్‌ బి.అడ్డయ్య, రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ పి.సుజాత, ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎం.అనూరాధ, న్యాయ విద్యా విభాగం సమన్వయకర్త డాక్టర్‌ వై.రాజేంద్రప్రసాద్‌ పాల్గొన్నారు.

:

Updated Date - Dec 03 , 2024 | 12:07 AM