కొండపైకి ఎక్కి.. సదస్సులు నిర్వహించి
ABN , Publish Date - Dec 26 , 2024 | 12:20 AM
hill మండలంలోని కొండపైభాగంగా ఉన్న కేరాశింగి, చందనగిరి పంచాయతీల్లో రెవెన్యూసదస్సులు ఎట్టకేలకు నిర్వహిం చారు. కొండపైభాగంలో పంచాయతీలు ఉండడంతో కిందిభాగంలో ఉండే గొడ్డ తదితర గ్రామాల్లో సమావేశాలు నిర్వహించేవారు.
మెళియాపుట్టి, డిసెంబరు 25(ఆంధ్రజ్యోతి): మండలంలోని కొండపైభాగంగా ఉన్న కేరాశింగి, చందనగిరి పంచాయతీల్లో రెవెన్యూసదస్సులు ఎట్టకేలకు నిర్వహిం చారు. కొండపైభాగంలో పంచాయతీలు ఉండడంతో కిందిభాగంలో ఉండే గొడ్డ తదితర గ్రామాల్లో సమావేశాలు నిర్వహించేవారు. అయితే డిప్యూటీ ముఖ్యమంత్రి పవణ్‌కళ్యాణ్ మన్యం జిల్లాలో పర్యటన సమయంలో రోడ్లు నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తామని, డోలీలు లేకుండా చేయడమే ధ్యేయమని ప్రకటించిన విషయం విదితమే. ఈనేపథ్యంలో కూటమి ప్రభుత్వం వైసీపీ హయాంలో నిలిపివేసిన రహదారులకు నిధులు మంజూరుచేయడంతో పనులు చేపట్టారు. దీంతో ఇక్కడ కేరాశింగి, చంద నగిరి పంచాయతీలకు రోడ్లు వేయడంతో అధికారులు పైకి వెళ్లి రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. దీంతో కేరసింగి ఏడు, చందనగిరి ఐదు రెవెన్యూ సమస్యలపై గిరిజనులు వినతిపత్రం అందజేశారు.