Share News

ఆర్‌అండ్‌బీ పనులు పూర్తిచేయండి: కలెక్టర్‌

ABN , Publish Date - Oct 22 , 2024 | 11:42 PM

జిల్లాలో ఆర్‌అండ్‌బీ పనులు సత్వరమే పూర్తిచేసేందుకు చర్యలుతీసుకోవాలని ఆ శాఖ ఎస్‌ఈని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌తో కలిసి జిల్లాలో నిర్మిస్తు న్న వివిధ ప్రాజెక్టుల పరిస్థితిపై అధికారులతో సమీక్షించారు.

ఆర్‌అండ్‌బీ పనులు పూర్తిచేయండి: కలెక్టర్‌
కొత్త కలెక్టరేట్‌ భవనం గురించి కలెక్టర్‌కు వివరిస్తున్న కాంట్రాక్టరు, సిబ్బంది

శ్రీకాకుళం, కలెక్టరేట్‌,అక్టోబరు 22(ఆంధ్రజ్యో తి): జిల్లాలో ఆర్‌అండ్‌బీ పనులు సత్వరమే పూర్తిచేసేందుకు చర్యలుతీసుకోవాలని ఆ శాఖ ఎస్‌ఈని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌తో కలిసి జిల్లాలో నిర్మిస్తు న్న వివిధ ప్రాజెక్టుల పరిస్థితిపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఇంటిగ్రేటెడ్‌ క లెక్టరేట్‌ పనులపై అడిగితెలుసుకున్నారు. ప నులను కాంట్రాక్టరు పవర్‌ పాయింట్‌ ప్రెజెం టేషన్‌ ద్వారా వివరించారు. బిల్లులు పెండిం గ్‌లో ఉంటే ఆ జాబితాను అందజేయాలని ఆదే శించారు. వనితమండలం పోలాకి హైలెవెల్‌ క్రాసింగ్‌ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి పోలీ సు, ఎంపీడీవో తదితర కార్యాలయాలు మార్చా లని కోరారు. కళింగపట్నం-శ్రీకాకుళం - పార్వ తీపురం రోడ్డు పనులపై కూడా సమీక్షించారు. రహదారి పనులు సత్వరమే పూర్తి చేయాలని, రహదారికి ఇరువైపులా బ్యూటిఫికేషన్‌ పనుల కు సంబంధించి పార్కింగ్‌, మరుగుదొడ్లు, సైకిల్‌ ట్రాకింగ్‌, ఫుట్‌పాత్‌, గ్రీనరీ పనులను పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని మున్సి పల్‌ ఇంజినీర్లను ఆదేశించారు. పెద్దపాడు చెరువు డీపీఆర్‌పై చర్చించారు. సమావేశంలో ఆర్డీవో కె.సాయి ప్రత్యూష, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ సుధాకర్‌, ఈఈ, డీఈలు, మున్సిపల్‌ కార్పొరే షన్‌ ఇంజనీర్లు పాల్గొన్నారు.

ఓటర్ల జాబితా సిద్ధంచేయండి

అరసవల్లి, అక్టోబరు22( ఆంధ్రజ్యోతి): జిల్లాలో సాగునీటి సంఘాల ఎన్నికల పక్రియ ప్రారంభంకావడంతో రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులు సమన్వయంతో పనిచేసి ఈనెల 31 నాటికి ఓటరు జాబితా తయారు చేయాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌తో కలిసి ఎంపీడీవోలు, తహసీల్దార్లు, పంచాయతీరాజ్‌, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ ఏపీవోలు, ఆర్‌డబ్ల్యూఎస్‌, హౌసింగ్‌ ఇంజనీరింగ్‌ అఽధికారులతో వీడియో కాన్పరెన్స్‌ నిర్వహించారు. పెండింగ్‌లో ఇళ్లు పూర్తి చేసేందుకు హౌసింగ్‌ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. 70వేల ఉపాధి హామీ పనిదినాల లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. పంచాయతీల్లో ప్రతిరోజు క్లోరినేషన్‌ చేయాలని, రక్షితమంచినీటి ట్యాంకులు శుభ్రం చేయాలన్నారు. కార్యాక్రమంలో డీఆర్వో అప్పారావు, వ్యవసాయశాఖ జేడీ త్రినాథస్వామి, డీపీవో భారతి సౌజన్య, ఇరిగేషన్‌ ఎస్‌ఈ పి. సుధాకర్‌, సీపీవో ప్రసన్నలక్ష్మి పాల్గొన్నారు.

Updated Date - Oct 22 , 2024 | 11:42 PM