సంప్రదాయ గురుకులం అభివృద్ధికి సహకరించండి
ABN , Publish Date - Nov 19 , 2024 | 11:47 PM
కల్లెపల్లి సముద్ర తీరంలో ఉన్న సంప్రదాయ గురుకులం అభివృ ద్ధికి సహకరించాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, గురుకులం డైరెక్టర్, నృత్య కళాకారిణి స్వాతి సోమనాథ్ కోరారు.
అరసవల్లి/శ్రీకా కుళం, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): కల్లెపల్లి సముద్ర తీరంలో ఉన్న సంప్రదాయ గురుకులం అభివృ ద్ధికి సహకరించాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, గురుకులం డైరెక్టర్, నృత్య కళాకారిణి స్వాతి సోమనాథ్ కోరారు. ఈ మేరకు వారు మంగళవారం విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు వినతిపత్రం అందజేశారు. కాగా శ్రీకాకుళం నియోజకవర్గానికి చెందిన పలువురు ముఖ్యమంత్రి సహాయనిధి కోసం దరఖాస్తు చేసుకోగా, అవి పరిశీలించి మంజూరుచేసిన నిధులను సీఎం లబ్ధిదారులకు ఎమ్మెల్యే శంకర్ సమక్షంలో అందజేశారు.