Share News

భోగి మంటలో టైట్లింగ్‌ యాక్ట్‌ జీవో కాపీలు

ABN , Publish Date - Jan 15 , 2024 | 12:07 AM

రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన భూ యాజమాన్య హక్కు చట్టం వల్ల ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా పోతుందని ఇచ్ఛాపురం బార్‌ అసోసియేషన్‌ న్యాయవాదులు అన్నారు.

భోగి మంటలో టైట్లింగ్‌ యాక్ట్‌ జీవో కాపీలు
భోగి మంటలో జీవో కాపీలు వేస్తున్న న్యాయవాదులు

ఇచ్ఛాపురం: రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన భూ యాజమాన్య హక్కు చట్టం వల్ల ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా పోతుందని ఇచ్ఛాపురం బార్‌ అసోసియేషన్‌ న్యాయవాదులు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో రద్దు చేయాలని కోరుతూ ఆదివారం ఆ జీవో కాపీ పత్రాలను భోగి మంటలో నిరసన తెలిపారు. న్యాయవాదులు, ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నా చట్టాన్ని రద్దు చేయ కుండా ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం తగదన్నారు. ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ రద్దు చేయాలని ఐఏఎల్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాగరాజుపాత్రో డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో న్యాయవాదులు ఎం.సోమశేఖర్‌, ఎస్‌ఎన్‌ నారాయణ, ఎన్‌.రమణయ్య, గిన్ని సీతయ్య, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 15 , 2024 | 12:07 AM