కుక్కల దాడిలో ఆవు మృతి
ABN , Publish Date - Sep 20 , 2024 | 11:44 PM
పురపాలక సంఘంలోని 23వ వార్డు లక్ష్ముడుపేటలో కుక్కల దాడిలో గాయపడిన ఆవు మృతి చెందింది.
ఆమదాలవలస: పురపాలక సంఘంలోని 23వ వార్డు లక్ష్ముడుపేటలో కుక్కల దాడిలో గాయపడిన ఆవు మృతి చెందింది. వివరాల్లోకి వెళితే లక్ష్ముడుపేటలో రెండు రోజుల కిందట పాడి రైతు పైడి హరినారాయణకు చెందిన ఆవుపై కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. గాయపడిన ఆవు చికిత్స పొందుతూ శు క్రవారం ఉదయం మృతి చెందింది. గతంలో కూడా ఇదే రైతుకు చెందిన రెండు ఆవులు కు క్కల దాడిలో మృతి చెందాయని గ్రామస్థులు తెలిపారు. గ్రామంలో కుక్కలు అధిక సం ఖ్యలో ఉన్నాయని, దాడులు చేస్తున్నాయని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా రు. వృద్ధులు, చిన్నారులు బయటకు వచ్చేందుకు భయపడుతున్నారన్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి కుక్కలను తరలించాలని గ్రామస్థులు కోరుతున్నారు.