Share News

నందికొండలో డెంగ్యూ కలకలం

ABN , Publish Date - Aug 04 , 2024 | 12:03 AM

మండల కేంద్ర సమీపాన నందికొండ కాలనీలో డెంగ్యూ జ్వర పీడిత కలకలం ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది.

నందికొండలో డెంగ్యూ కలకలం

సరుబుజ్జిలి: మండల కేంద్ర సమీపాన నందికొండ కాలనీలో డెంగ్యూ జ్వర పీడిత కలకలం ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న ఈ గ్రామానికి చెందిన బెండి ప్రభాకరరావుకు శ్రీకాకుళం వైద్యులు డెంగ్యూ జ్వరంగా నిర్ధారించారు. ప్రభాకరరా వు కుటుంబ సభ్యులు అందించిన వివరాల మేరకు.. గతవారం రోజులుగా జ్వరం బారినపడి స్థానిక ప్ర భుత్వ ఆసుపత్రిలో వైద్య సాయం పొందినా.. ఆరోగ్యం క్షీణించింది. దీంతో శ్రీకాకుళంలోని ఓ ప్రైవేట్‌ ఆసుప త్రికి తరలించగా అక్కడ రక్త పరీక్షలు చేసిన వైద్యులు రక్త కణాలు 87వేలకు తగ్గా యని, డెంగ్యూ జ్వరంగా వైద్యులు నిర్ధారించారు. శనివారం గ్రామానికి చేరుకున్న ప్రభాకరరావు డెంగ్యూ జ్వరం బారిన పడిన విషయాన్ని తెలుసుకున్న నందికొండ కాలనీ ప్రజలు భయాందోళన చెందారు.

Updated Date - Aug 04 , 2024 | 12:03 AM