Share News

మెట్టవలసలో తగ్గని డయేరియా

ABN , Publish Date - Aug 09 , 2024 | 12:12 AM

మెట్టవల సలో డయేరియా వ్యాప్తి తగ్గడం లేదు. గురువారం మరో తొమ్మిది మంది డయే రియా బారిన పడగా.. బాధి తుల సంఖ్య 71కి చేరింది.

మెట్టవలసలో తగ్గని డయేరియా

- 71కి చేరిన బాధితుల సంఖ్య

జి.సిగడాం: మెట్టవల సలో డయేరియా వ్యాప్తి తగ్గడం లేదు. గురువారం మరో తొమ్మిది మంది డయే రియా బారిన పడగా.. బాధి తుల సంఖ్య 71కి చేరింది. గ్రామంలోనే వైద్యాధికారులు యశ్వంత్‌, సుమబిందు వైద్యసేవలు అందిస్తున్నారు. మరో రెండు రోజుల్లో డయేరియా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. గ్రామంతో పాటు సమీపంలో ఉన్న కోళ్లఫారాన్ని డీపీవో వెంకటేశ్వరరావు గురువారం పరిశీలించారు. ఈగలు, దోమలు ప్రబలకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని యాజమాన్యా నికి, స్థానికులకు ఆదేశించారు. ఆయన వెంట ఈవోఆర్డీ శ్రీనివాసులు, పంచాయతీ కార్యదర్శి సతీష్‌, సీహెచ్‌ శివప్రసాద్‌, కామోజుల సీతారాం, బెవర జగన్నాథరావు, సర్పంచ్‌ ఆరుద్ర, ఎంపీటీసీ సభ్యురాలు లక్ష్మి ఉన్నారు.

Updated Date - Aug 09 , 2024 | 12:12 AM