బిల్లులు పెండింగ్ ఉంచొద్దు
ABN , Publish Date - Dec 08 , 2024 | 12:24 AM
సబ్‌ట్రెజరీ కార్యాలయాల్లో వివిధ శాఖల బిల్లులు, పనుల బిల్లులు పెండింగ్ లేకుండా చూడాలని స్థానిక ఎస్‌టీవో కేఎస్‌ఎస్ ప్రసాద్, సిబ్బందిని జిల్లా ట్రెజరీ కార్యాలయం డీడీ సీ హెచ్ రవికుమార్ ఆదేశించారు.
- ట్రెజరీశాఖ డీడీ రవికుమార్
పొందూరు, డిసెంబరు 7(ఆంధ్రజ్యోతి): సబ్‌ట్రెజరీ కార్యాలయాల్లో వివిధ శాఖల బిల్లులు, పనుల బిల్లులు పెండింగ్ లేకుండా చూడాలని స్థానిక ఎస్‌టీవో కేఎస్‌ఎస్ ప్రసాద్, సిబ్బందిని జిల్లా ట్రెజరీ కార్యాలయం డీడీ సీ హెచ్ రవికుమార్ ఆదేశించారు. వార్షిక తనిఖీ ల్లో భాగంగా స్థానిక ట్రెజరీ కార్యాలయాన్ని ఆయన పరిశీలిం చారు. ప్రతీ పింఛన్‌దారుడు సకాలంలో లైఫ్ సర్టిపికేట్ అందించేలా చర్య లు తీసుకోవాలన్నారు. కార్యాలయంలో రికార్డులు పరిశీలించి సంతృప్తి వ్య క్తం చేశారు. కార్యాలయ సిబ్బంది పి.శ్రీనివాసరావు, పి.చంద్రశేఖర్, శ్రీనివాసరావు, రమణమ్మ పాల్గొన్నారు.