Share News

అధైర్య పడొద్దు.. అండగా ఉంటాం

ABN , Publish Date - Dec 02 , 2024 | 11:47 PM

‘ మీరు అధైర్య పడొద్దు.. మేము అండగా ఉంటాం. అందరినీ స్వదేశానికి తీసుకొస్తాం.’ అని కేంద్ర మంత్రి కింజ రాపు రామ్మోహన్‌నాయుడు సౌదీలో చిక్కుకున్న జిల్లా కార్మికులకు భరోసా ఇచ్చారు.

అధైర్య పడొద్దు.. అండగా ఉంటాం
సౌదీలో చిక్కుకున్న కార్మికులతో వీడియో కాల్‌లో మాట్లాడుతున్న రామ్మోహన్‌

- సౌదీలో చిక్కుకున్న జిల్లా వలస కార్మికులకు కేంద్రమంత్రి రామ్మోహన్‌ భరోసా

శ్రీకాకుళం, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి):‘ మీరు అధైర్య పడొద్దు.. మేము అండగా ఉంటాం. అందరినీ స్వదేశానికి తీసుకొస్తాం.’ అని కేంద్ర మంత్రి కింజ రాపు రామ్మోహన్‌నాయుడు సౌదీలో చిక్కుకున్న జిల్లా కార్మికులకు భరోసా ఇచ్చారు. ఇచ్ఛాపురం, కం చిలి, సోంపేట, వజ్రపుకొత్తూరు, నందిగాం, ఒడి శా రాష్ట్రం గంజాం జిల్లాకు చెందిన సుమారు 30 మంది వలస కార్మికులు సౌదీ వెళ్లి చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. రెండు మాసాలు పనిచేసినా సంబంధిత యాజమాన్యం జీతాలు చెల్లించకపోవ డం, గత నాలుగు రోజులుగా తిండి కూడా లేకపో వడంతో వారంతా అల్లాడిపోయారు. ఈ విషయాన్ని ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌.. కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై స్పందించిన ఆయన.. బాధిత కార్మికులతో సోమ వారం ఫోన్‌లో మాట్లాడారు. అందరినీ సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చేలా కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ను కలసి ఒప్పిస్తానని తెలిపారు. అలాగే భారత ఎంబసీ కార్యాలయానికి విషయాన్ని చేరవేస్తానని చెప్పారు.

Updated Date - Dec 02 , 2024 | 11:47 PM