నేటి నుంచి దసరా సెలవులు
ABN , Publish Date - Oct 01 , 2024 | 11:28 PM
దసరా సెలవుల సందడి ప్రారంభ మైంది. బుధవారం గాంధీ జయంతి కావడంతో మంగళవారం నుంచే విద్యార్థులు ఇళ్లబాట పట్టారు.
టెక్కలి/జలుమూరు: దసరా సెలవుల సందడి ప్రారంభ మైంది. బుధవారం గాంధీ జయంతి కావడంతో మంగళవారం నుంచే విద్యార్థులు ఇళ్లబాట పట్టారు. బుధవారం నుంచి అక్టోబరు 13వ తేదీ వరకు పాఠశాలలకు విద్యాశాఖ సెలవు లను ప్రకటించింది. 14న పాఠశాలలు పునఃప్రారంభం కాను న్నాయి. ఈ మేరకు మంగళవారం పాఠశాలలు, హాస్టళ్ల నుంచి ఇళ్లకు బయలుదేరారు. జిల్లాలో 2,636 ప్రాథమిక, ప్రాథమి కోన్నత, జడ్పీ ఉన్నతపాఠశాలలుండగా 1,71,712 మంది విద్యా ర్థులు, అలాగే ప్రైవేట్ పాఠశాలల్లో 1,05,075 మంది విద్యా ర్థులు చదువుతున్నారు. ఇదిలా ఉండగా ఈ సెలవుల్లో విద్యా ర్థులు సమయాన్ని వృథా చేయకుండా విద్యాశాఖ ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించింది. ఎనిమిది రోజులు ప్రతి విద్యార్థి ఏడు సబ్జెక్టుల్లో 70 నుంచి 80 ప్రశ్నలకు జవాబులు నేర్చుకునేలా ఎసైన్‌మెంట్ తయారు చేసినట్లు డీఈవో తిరు మల చైతన్య తెలిపారు. దసరా మూడురోజులు పండగ మినహాయిస్తే మిగిలిన రోజులు విద్యార్థులు సమయాన్ని వృథా చేయకుండా ఈ టాస్క్ ఇచ్చామన్నారు. దీనివల్ల విద్యా ర్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.