ముందస్తు సంక్రాంతి సంబరాలు
ABN , Publish Date - Jan 08 , 2024 | 12:11 AM
ప్రభుత్వ వసతి గృహాల్లో ఆదివారం ముందస్తు సంక్రాంతి సంబరాలు నిర్వ హించారు. నరసన్నపేట బీసీ, సోషల్ వెల్ఫేర్ బాలికల వసతి గృహాలతో పాటు పలాస బీసీ వసతిగృహంలోనూ ఈ వేడుకలు చేపట్టారు. హాస్టళ్లకు సెలవులు ప్రకటించిన నేపథ్యం లో సంబరాలు చేపట్టారు.
నరసన్నపేట/పలాస, జనవరి 7: ప్రభుత్వ వసతి గృహాల్లో ఆదివారం ముందస్తు సంక్రాంతి సంబరాలు నిర్వ హించారు. నరసన్నపేట బీసీ, సోషల్ వెల్ఫేర్ బాలికల వసతి గృహాలతో పాటు పలాస బీసీ వసతిగృహంలోనూ ఈ వేడుకలు చేపట్టారు. హాస్టళ్లకు సెలవులు ప్రకటించిన నేపథ్యం లో సంబరాలు చేపట్టారు. రంగవల్లులను తీర్చిదిద్ది భోగీ మంటలు వేయడంతో పాటు పాయసం వండి పంచిపెట్టారు. సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా ఉత్సవాలు నిర్వహిం చారు. కార్యక్రమాల్లో బీసీ సంక్షేమాధికారి అనూ రాధ, ఏఎస్ డబ్ల్యూవో త్రినాథరావు, వార్డెన్లు సుజాత, టెంక సూర్యప్రభ, డి.కృష్ణవేణి, ఉపాధ్యాయినులు, విద్యార్థినులు పాల్గొన్నారు.