triple IT; ట్రిపుల్ ఐటీలో సదుపాయాల కల్పనకు కృషి
ABN , Publish Date - Dec 25 , 2024 | 12:19 AM
triple IT;ఆర్జీయూకేటీ శ్రీకాకుళం క్యాంపస్‌లో( ట్రిపుల్ ఐటీ) మౌలిక సదుపాయాల కల్పనకు కృషిచేస్తానని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు హామీఇచ్చారు.
ఎచ్చెర్ల, డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి): ఆర్జీయూకేటీ శ్రీకాకుళం క్యాంపస్‌లో( ట్రిపుల్ ఐటీ) మౌలిక సదుపాయాల కల్పనకు కృషిచేస్తానని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు హామీఇచ్చారు. ట్రిపుల్ ఐటీ క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ కేవీజీడీ బాలాజీ, ఏవో ముని రామకృష్ణ నడుకుదిటివానిపాలెంలోని ఎమ్మెల్యే క్యాంపస్‌లో మంగళవారం కలిశారు. క్యాంపస్‌లో అంతర్గత రోడ్డు నిర్మించాలని, అసంపూర్తిగా ఉన్న ప్రహరీని పూర్తిచేయాలని, తాగునీటికి శాశ్వత పరిష్కారం చూపాలని ఎమ్మెల్యేను కోరారు. అదనపు తరగతి గదులు, వసతి గృహం నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని, ఎచ్చెర్ల పాత జాతీయ రహదారి నుంచి క్యాంపస్ వచ్చే వరకు రహదారి పొడవునా విద్యుత్ దీపాలు ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని కోరినట్లు ట్రిపుల్ ఐటీ అఽధికారులు చెప్పారు. రహదారి పొడవునా దీపాల కోసం సంబంధిత అధికారులతో ఎమ్మెల్యే మాట్లాడారని, మిగిలిన సమస్యలను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషిచేస్తామని ఎమ్మెల్యే హామీఇచ్చారని తెలిపారు.
సమస్యలు పరిష్కరించాలి
రణస్థలం, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి) : ప్రజల సమస్యలు పరిష్కారం దిశగా అధికారులు పనిచేయాలని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు కోరారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపుకార్యాలయంలో హౌసింగ్ సబ్బందితో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి లబ్దిదారులు ఎదుర్కొంటున్న సమస్య లను తెలుసుకొని పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో హౌసింగ్ ఏఈలు, వర్క్ ఇన్ స్పెక్టర్లు, ఇంజినీరింగ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.