అపార్ నమోదులో ఇబ్బంది లేకుండా చర్యలు: సీఈవో
ABN , Publish Date - Nov 14 , 2024 | 11:41 PM
: అపార్ నమోదులో విద్యార్థులకు ఇబ్బందిలేకుండా పాఠశాలలు, కళాశాలలు వద్ద ఆధార్ నమోదు కేంద్రాలను ఏర్పాటుచేసి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసు కుం టున్నామని జడ్పీ సీఈవో కేవీఎన్ శ్రీధర్ రాజా తెలి పారు. గురువారం స్థానిక జూనియర్ కళాశాలలో మొబైల్ ఆధార్ నమోదు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు.
నరసన్నపేట, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): అపార్ నమోదులో విద్యార్థులకు ఇబ్బందిలేకుండా పాఠశాలలు, కళాశాలలు వద్ద ఆధార్ నమోదు కేంద్రాలను ఏర్పాటుచేసి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసు కుం టున్నామని జడ్పీ సీఈవో కేవీఎన్ శ్రీధర్ రాజా తెలి పారు. గురువారం స్థానిక జూనియర్ కళాశాలలో మొబైల్ ఆధార్ నమోదు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు.కార్యక్రమంలో ఎంపీడీవో మధుసూదనరావు, ఎంఈ వోలు ఉప్పాడ శాంతారావు, పేడాడ దాలినాయుడు, ప్రిన్సిపాల్ సత్యన్నారాయణపాల్గొన్నారు. తొలుత ఎంపీడీవో కార్యాలయంలో హౌసింగ్ నిర్మాణాలపై గృహా నిర్మాణశాఖ అధికారులతో సమీక్షించారు.
సీఎస్సీ ఆధార్ కేంద్రం పరిశీలన
పలాస రూరల్,నవంబరు14(ఆంధ్రజ్యోతి): పలాసలో నిర్వహిస్తున్న బీఎస్‌ఎన్‌ఎల్ సీఎస్సీ ఆధార్ కేంద్రాన్ని ఆర్డీవో గ్రంథి వెంకటేష్ గురువా రం పరిశీలించారు. అపార్‌తో విద్యార్థుల వివ రాల నమోదు, మార్పులు, చేర్పులపై నిర్వా హకులకు సూచనలుచేశారు. రోజుకు ఎన్ని నమోదవుతున్నాయి, నమోదులో ఇబ్బందు లపై అడిగి తెలుసుకున్నారు.
నిబంధనలు సవరించాలి
కోటబొమ్మాళి, నవంబరు 14(ఆంధ్ర జ్యోతి): అపార్ నంబర్ జనరేట్ కాకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని హరిశ్చం ద్రపురం ఎంపీటీసీ మాజీ సభ్యుడు హనుమంతు అప్పలరాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఒకటి నుంచి పదో తరగతి వరకు హెడ్ మాస్టర్ ఇచ్చిన సర్టిఫికెట్ ప్రకారం ఆధార్‌లో మార్పులు చేసేలా నిబంధనలు సవరించాలని కోరారు. విద్యార్ధులు 15 రోజుల నుంచి తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారన్నారు.