Share News

పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత

ABN , Publish Date - Jul 14 , 2024 | 11:25 PM

పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత అని స్వేచ్ఛ హ్యూమన్‌ రైట్స్‌ ఆర్గనైజేషన్‌ డైరెక్టర్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈఈ కూన విష్ణుమూర్తి అన్నారు.

 పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత

ఇచ్ఛాపురం: పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత అని స్వేచ్ఛ హ్యూమన్‌ రైట్స్‌ ఆర్గనైజేషన్‌ డైరెక్టర్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈఈ కూన విష్ణుమూర్తి అన్నారు. ఆదివారం కేదారంపురం గ్రామంలో ఆరోగ్యం, విద్య, పరిసరాల పరిశుభ్రత వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఇమాన్యుయేల్‌ రాజు మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనచోదకులు తప్పకుం డా హెల్మెట్‌ను ధరించాలని తెలిపారు. మైనర్లు వాహనాలు నడపకూడదని, గంజా యి, గుట్కా వంటి మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్‌ ఎస్‌ఐ లక్ష్మణరావు, ఆదిత్య యూనివర్సిటీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఎం.సాయిసుదీర్‌, అనిల్‌కుమార్‌, అడిషనల్‌ డైరెక్టర్‌ ప్రత్యూష, సెక్రటరీ అనిల్‌, కేదారిపురం సర్పంచ్‌, మండల ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు హరిశ్చంద్ర, సాయి కృష్ణ, విశ్వనాథం, రవికుమార్‌, ప్రవీణ్‌ కుమారి, దివ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 14 , 2024 | 11:25 PM