Share News

ఫీల్డ్‌ అసిస్టెంట్‌ ఆత్మహత్యాయత్నం

ABN , Publish Date - Aug 22 , 2024 | 12:15 AM

శ్రీజగన్నాథపురం పంచాయతీ ఉపాధి హామీ ఫీల్డ్‌ అసిస్టెంట్‌ గుంట సోమేశ్వరరావు మంగళవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు.

ఫీల్డ్‌ అసిస్టెంట్‌ ఆత్మహత్యాయత్నం

కోటబొమ్మాళి: శ్రీజగన్నాథపురం పంచాయతీ ఉపాధి హామీ ఫీల్డ్‌ అసిస్టెంట్‌ గుంట సోమేశ్వరరావు మంగళవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. బంధువులు తక్షణమే శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. వివరాల్లోకి వెళితే.. శ్రీజగన్నాథపురంలో 2023-24లో జరిగిన ఉపాఽధిహామీ పనులకు సంబంధించి మంగళవారం సామాజిక తనిఖీలు నిర్వహిం చారు. సోమశ్వరరావుపై పలు అవినీతి ఆరోపణలు రావడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని స్థానికులు తెలిపారు.

Updated Date - Aug 22 , 2024 | 12:15 AM