road accidents; రోడ్డు ప్రమాదాల నివారణపై దృష్టి
ABN , Publish Date - Dec 25 , 2024 | 12:28 AM
road accidents; జిల్లాలో జాతీయ రహదారిపై జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణపై దృష్టి సారించాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి కోరారు. అపరిష్కృతంగా ఉన్న ఆస్తి, మహిళలకు సంబందించిన కేసులపై చర్యలు తీసుకో వాలని తెలిపారు.
శ్రీకాకుళం క్రైం, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో జాతీయ రహదారిపై జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణపై దృష్టి సారించాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి కోరారు. అపరిష్కృతంగా ఉన్న ఆస్తి, మహిళలకు సంబందించిన కేసులపై చర్యలు తీసుకో వాలని తెలిపారు. జిల్లాలో గంజాయిని పూర్తి స్థాయిలో అరికట్టాల ని సూచించారు. మంగళవారంజిల్లా పోలీసు కార్యాలయంలో పోలీ సు అధికారులతో ఎస్పీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఇటీవల జిల్లాలో జరి గిన రోడ్డు ప్రమాదాల్లో ప్రాణనష్టం వాటిల్లిందని, ఇటువంటి ఘట నలు పునరావృతం కాకుండా జాతీయరహదారిపై గుర్తించిన ప్రమా ద స్థలాల వద్ద వేగనియంత్రణ చర్యలు తీసుకోవాలని కోరా రు.
జాతీయరహదారులపై వాహనాలు నిలిపివేయకుండ హైవే పెట్రో లింగ్ సిబ్బంది చర్యలు చేపట్టాలని తెలిపారు. పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలని కోరారు. గ్రామాలను సంద ర్శించాలని అక్కడి పరిస్థితులను సమీక్షించి నేరాలు జరగకుండా చొరవ చూపాలన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన వారి లైసె న్స్‌లు రద్దుచేయాలని, పేకాట శిబిరా లు, బెల్టుషాపులపై దాడులు నిర్వ హించాలని ఆదేశించారు. గంజాయి కేసులో అరెస్టై విడుదలైన నింది తులపై నిఘా ఉంచాలన్నారు. సరి హద్దు ప్రాంతాల్లో చెక్‌పోస్టుల వద్ద ఉన్న సిబ్బంది నిరంత రం అప్రమ త్తంగా ఉండాలని, సంకల్పం పేరిట మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్ధాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని తెలిపారు.సైబర్ నేరాలు,రోడ్డు భద్రతపై కూడా ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదే శించారు. పాతముద్దాయిలు, రౌడీషీటర్ల కదలికపై దృష్టి సారించాలన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ కేవీ రమణ, డీఎస్పీలు వివేకానంద, మూర్తి, ఏవో గోపినాధ్ పాల్గొన్నారు.