Share News

వినతుల పరిష్కారంపై దృష్టి పెట్టండి: కలెక్టర్‌

ABN , Publish Date - Dec 08 , 2024 | 12:02 AM

రెవె న్యూ సదస్సుల్లో వచ్చే వినతుల్లో అవకాశం ఉన్న వాటిని అక్కడి కక్కడే పరిష్కరించడంపై దృష్టి పెట్టాలని కలెక్టర్‌ బీఆర్‌ అంబే డ్కర్‌ ఆదేశించారు. అందుబా టులో ఉన్న సిబ్బందితో అప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో తనిఖీ చేయించి, వెంటవెంటనే సమస్యలను పరిష్కరించాలని సూచించారు.

 వినతుల పరిష్కారంపై దృష్టి పెట్టండి: కలెక్టర్‌
పతాకనిధికి విరాళం ఇస్తున్న కలెక్టర్‌ అంబేడ్కర్‌:

విజయనగరం, కలెక్టరేట్‌, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి) రెవె న్యూ సదస్సుల్లో వచ్చే వినతుల్లో అవకాశం ఉన్న వాటిని అక్కడి కక్కడే పరిష్కరించడంపై దృష్టి పెట్టాలని కలెక్టర్‌ బీఆర్‌ అంబే డ్కర్‌ ఆదేశించారు. అందుబా టులో ఉన్న సిబ్బందితో అప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో తనిఖీ చేయించి, వెంటవెంటనే సమస్యలను పరిష్కరించాలని సూచించారు. శనివారం రాత్రి కలెక్టరు అంబేడ్కర్‌ జేసీ సేతు మాధవన్‌, ఆర్డీవోలు, తహసీల్దార్లు , రెవెన్యూ సిబ్బందితో వీడియో కాన్పెరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మొదటిరోజు జిల్లా వ్యాప్తంగా 39 గ్రామాల్లో నిర్వహించిన రెవెన్యూసదస్సుల్లో 533 వినతులు అందగా వాటిని ఆన్‌లైన్‌ చేయ డంపై మండలాల వారీగా సమీక్షించారు. కార్య క్రమంలో డీఆర్వో శ్రీనివాసమూర్తి, నియోజ కవర్గం ప్రత్యేకాధికారులు పాల్గొన్నారు.

సైనికుల సేవలు మరవలేం

సైనికులు దేశభక్తి, సాహసం, త్యాగాలు,సేవలు మరవలేమని కలెక్టరు అంబేడ్కర్‌ కొని యాడారు. సాయుధదళాల పతాకదినోత్సవం పురస్కరించుకుని కలెక్టరేట్‌ వద్ద పతాక నిధి ప్లాగ్‌ను ఆయన అందించారు.ఈసందర్బంగా కలెక్టరు మాట్లాడుతూ పాకిస్తాన్‌, చైనా యుద్ధ సమయాల్లో, కార్గిల్‌ పోరాటంలో సైనికుల త్యాగాలు మరలేమన్నారు. దేశం కోసం ప్రాణాలర్పించారని, అటువంటి వారి కుటుంబాలకు తమ వంతు సాయం అందించాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో జిల్లా సైనిక సంక్షేమ అధికారి మజ్జి కృష్ణరావు పాల్గొన్నారు.

Updated Date - Dec 08 , 2024 | 12:03 AM