నేరాల నియంత్రణపై దృష్టి సారించాలి
ABN , Publish Date - Dec 22 , 2024 | 12:03 AM
రాత్రి వేళల్లో ముమ్మరంగా గస్తీ విధులు నిర్వ హించి నేరాల నియంత్రణపై దృష్టిసారించాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి సూచించారు.
శ్రీకాకుళం క్రైం, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): రాత్రి వేళల్లో ముమ్మరంగా గస్తీ విధులు నిర్వ హించి నేరాల నియంత్రణపై దృష్టిసారించాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి సూచించారు. శనివారం రూరల్ పోలీసు స్టేషన్‌ను ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులు పరిశీలించారు. ప్రతీ రోజూ విజబుల్ పోలీసింగ్ నిర్వహించి అక్రమ రవాణాను అరికట్టాలని, అ సాంఘిక కార్యకళాపాలు నియంత్రణకు చర్యలు చేపట్టాలని సిబ్బందికి సూచించారు. ఎస్‌ఐ కె.రాము ఉన్నారు.