Share News

ఐటీడీఏ ఏర్పాటు చేయండి: ఎంజీఆర్‌

ABN , Publish Date - Dec 19 , 2024 | 11:52 PM

మెళియాపుట్టిలో ఐటీ డీఏ ఏర్పాటుచేయాలని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కోరారు. ఈ మేరకు కేంద్ర గిరిజనవ్యవహారాలశాఖ మంత్రి జుయల్‌ ఓరంను ఢిల్లీలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడుతో గురువారం కలిశారు.

   ఐటీడీఏ ఏర్పాటు చేయండి: ఎంజీఆర్‌
జుయల్‌ ఓరంకు వినతిపత్రం ఇస్తున్న మామిడి గోవిందరావు

పాతపట్నం/మెళియాపుట్టి/అరసవల్లి, డిసెంబరు 19(ఆంధ్రజ్యోతి):మెళియాపుట్టిలో ఐటీ డీఏ ఏర్పాటుచేయాలని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కోరారు. ఈ మేరకు కేంద్ర గిరిజనవ్యవహారాలశాఖ మంత్రి జుయల్‌ ఓరంను ఢిల్లీలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడుతో గురువారం కలిశారు. ఈసందర్భంగా గిరిజన జనసాంద్రత ఎక్కువగల గల పాతపట్నం నియోజకవర్గంలో ఐటీడీఏ ఏర్పాటు ఆవశ్యకతను వివరించా రు. ఐటీడీఏ ఏర్పాటుపై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎంజీఆర్‌ తెలిపారు.

Updated Date - Dec 19 , 2024 | 11:52 PM