దేవీ ఆశ్రమంలో పౌర్ణమి పూజలు
ABN , Publish Date - Mar 26 , 2024 | 12:08 AM
కుంచాల కురమయ్యపేటలోని దేవీ ఆశ్రమంలో సోమవారం పౌర్ణమి పూజలు ఘనంగా జరిగాయి.
ఎచ్చెర్ల: కుంచాల కురమయ్యపేటలోని దేవీ ఆశ్రమంలో సోమవారం పౌర్ణమి పూజలు ఘనంగా జరిగాయి. పీఠాధిపతి తేజోమూర్తుల బాలభాస్కరశర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజరాజేశ్వరి దేవీకి ప్రత్యేకంగా అలంకరించి పూజలు జరిపారు. శ్రీచక్రాల వద్ద కుంకుమ పూజలు జరిపించారు.