Share News

తితలీ బాధితులకు పరిహారం ఇప్పించండి

ABN , Publish Date - Jul 26 , 2024 | 11:33 PM

తితలీ తుఫాన్‌లో నష్టపో యి పరిహారం అందని రైతులకు న్యాయం చేయా లని ఉద్దానం రైతు లు, కవిటి మండ ల టీడీపీ నాయకు లు కోరారు.

తితలీ బాధితులకు పరిహారం ఇప్పించండి
కవిటి: మంత్రికి వినతిపత్రం అందిస్తున్న దృశ్యం

- మంత్రి అచ్చెన్నాయుడిని కోరిన ఉద్దానం రైతులు

కవిటి: తితలీ తుఫాన్‌లో నష్టపో యి పరిహారం అందని రైతులకు న్యాయం చేయా లని ఉద్దానం రైతు లు, కవిటి మండ ల టీడీపీ నాయకు లు కోరారు. ఈ మేరకు విజయవాడలో శుక్రవారం మంత్రి కె.అచ్చెన్నాయుడును కలిసి వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. తితలీ తుఫా న్‌లో ఉద్దానం ప్రాంతం అతలాకుతలమై కొబ్బరి పంట నాశనమైందన్నారు. రైతు లను ఆదుకోవాలని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కొబ్బరి చెట్టుకు రూ.1500 చొప్పున మూడు విడతలుగా అందించారన్నారు. అయితే వివిధ సాంకేతిక కా రణాలు చూపి 6,612 మంది రైతులకు పరిహారం అందకుండా పోయింది. కొందరి రైతులకు అప్పుడు చెక్కులు అందినా బ్యాంకు ఖాతాల్లో సొమ్ము జమకాలేదన్నారు. అప్పటి నుంచి రైతులు తమ మొరను అధికారులు, నాయకులకు వివరిస్తూనే ఉ న్నా పట్టించుకోలేదన్నారు. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం రెట్టింపు పరిహా రం పేరిట రైతులకు పంపిణీ చేశామని చెప్పినా వీరికి అందలేదన్నారు. ప్రతి పక్షనేతగా ఉన్న సమయంలో చంద్రబాబు రైతులకు కొంత భరోసా ఇచ్చి అధికా రంలోకి వచ్చాక ఆలోచన చేద్దామని చెప్పారని గుర్తుచేశారు. టీడీపీ నేతలు ఎస్‌వీ రమణ, పి.కృష్ణారావు, ఎల్‌.శ్రీను, ఎం.రామారావు, బి.విజయకృష్ణ, బి.రమేష్‌, ఎన్‌.పు రుషోత్తం, పి.రాజు తదితరులు మంత్రిని కలిసి పరిస్థితిని వివరించారు.

ఎస్సీ,ఎస్టీ బ్యాక్‌లాగ్‌ పోస్టులు భర్తీ చేయండి

కంచిలి: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఎస్సీ,ఎస్టీ బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని ఎస్సీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి మర్రిపాటి పూర్ణ, ఎమ్మెల్యే అశోక్‌తో కలిసి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుని విజయవాడలో కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఖాళీల రిక్రూట్‌మెంట్‌ ద్వారా భర్తీ చేయాలని కోరినట్టు తెలిపారు. వినతి పత్రం అందించారు. అలాగే బేడ, బుడగ జంగం విద్యార్థులకు కుల ధ్రువీకరణ పత్రాలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని మండల టీడీపీ నాయకులు మంత్రి అచ్చెన్నాయుడుని విజయవాడ కార్యాలయంలో ఎమ్మెల్యే బెందాళం అశోక్‌తో కలిసి శుక్రవారం వినతి పత్రం అందించారు. మాదిన రామారావు, పిలక చినబాబు, టీవీ రమణ, మర్రిపాటి పూర్ణ, పూర్ణబిషోయి ఉన్నారు.

Updated Date - Jul 26 , 2024 | 11:33 PM