Share News

బంగారు ఆభరణాలు ఇవ్వండి

ABN , Publish Date - Dec 03 , 2024 | 12:13 AM

: బ్యాంకులో తాకట్టు పెట్టిన ఆభరణాలు ఇవ్వా లని ఖాతాదారులు డిమాండ్‌ చేశారు.ఈ మేరకు బంగారం ఆభరణాలు తాకట్టు పెట్టిన ఖాతాదారులు సోమవారం గార స్టేట్‌ బ్యాంక్‌ ఎదుట నిరసనతెలిపారు. ఇటీ వల బ్యాంకు వద్దకు వచ్చి తమ బంగారు ఆభరణాలు ఇవ్వాలని నిరసన తెలిపిన విషయం విదితమే.

బంగారు ఆభరణాలు ఇవ్వండి
గార ఎస్‌బీఐ బ్రాంచ్‌ గేట్‌ వద్ద నిరసన తెలుపుతున్న ఖాతాదారులు :

గార, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): బ్యాంకులో తాకట్టు పెట్టిన ఆభరణాలు ఇవ్వా లని ఖాతాదారులు డిమాండ్‌ చేశారు.ఈ మేరకు బంగారం ఆభరణాలు తాకట్టు పెట్టిన ఖాతాదారులు సోమవారం గార స్టేట్‌ బ్యాంక్‌ ఎదుట నిరసనతెలిపారు. ఇటీ వల బ్యాంకు వద్దకు వచ్చి తమ బంగారు ఆభరణాలు ఇవ్వాలని నిరసన తెలిపిన విషయం విదితమే. ఆ సమయంలో బ్యాంకు ఏఆర్‌ఎం రామరాజు ఖాతాదారులతో మాట్లాడి డిసెంబరు రెండోతేదీన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.దీంతో పలు వురు ఖాతాదారులు సోమవారం బ్యాంక్‌ గేట్‌ ఎదుట బంగారు ఆభరణాల ఇవ్వాలని నిరసన తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న గార ఎస్‌ఐ ఆర్‌.జనార్దన్‌ బ్యాంకు వద్దకు చేరుకున్నారు. ఖాతాదారులు ఆందోళన చెందుతున్న నేపద్యంలో అక్కడకు చేరుకున్న బ్యాంకు ఏఆర్‌ఎం రామరాజు ఖాతాదారులతో మాట్లాడారు. బంగారు ఆభరణాలే తమకు ఇవ్వాలని పట్టుపట్టారు. ఆ సమయంలో బ్యాంక్‌ ఆర్‌ఎంకు కొంద రు ఖాతాదారులు ఫోన్‌చేసి తమ బంగారు ఆభరణాలు వెంటనే ఇప్పించాలని కోరా రు. తాను హైదరాబాద్‌లో ఉన్నందున మంగళవారం వచ్చి మాట్లాడుతానని చెప్ప డంతో ఖాతాదారులు నిరసన కార్యక్రమం విరమించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ మార్పు దుర్గా పృద్వీరాజ్‌, ఎంపీటీసీ మాజీ సభ్యుడు జల్లు రాజీవ్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 03 , 2024 | 12:13 AM