Share News

వైభవంగా ఆదిత్యుని కల్యాణం

ABN , Publish Date - Apr 20 , 2024 | 12:09 AM

అరసవల్లి సూర్యనారాయణ స్వామివారి కల్యాణ మహోత్సవం శుక్ర వారం రాత్రి వైభవంగా జరిగింది. తొలుత ఉషా, ఛాయా, పద్మినీ సమేతంగా స్వామి ఉత్సవ మూర్తులను ఆంజనేయ వాహనంపై గ్రామంలో మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, కోలాటం నడు మ తిరువీధి నిర్వహించారు.

వైభవంగా ఆదిత్యుని కల్యాణం
హైకోర్టు న్యాయమూర్తికి జ్ఞాపికను అందిస్తున్న ఈవో చంద్రశేఖర్‌

అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామివారి కల్యాణ మహోత్సవం శుక్ర వారం రాత్రి వైభవంగా జరిగింది. తొలుత ఉషా, ఛాయా, పద్మినీ సమేతంగా స్వామి ఉత్సవ మూర్తులను ఆంజనేయ వాహనంపై గ్రామంలో మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, కోలాటం నడు మ తిరువీధి నిర్వహించారు. అనంతరం అనివెట్టి మండపంలో ఆలయ ప్రధాన అర్చకుడు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో చతుర్వేద పండితుల వేద మంత్రోచ్ఛారణల మధ్య కల్యాణం చేపట్టారు. కార్యక్రమంలో ఈవో ఎస్‌.చంద్రశేఖర్‌, ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.

ఆదిత్యుని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి

అరసవల్లి: ప్రత్యక్షదైవం, ఆరోగ్య ప్రదాత అరసవిల్లి సూర్యనారాయణ స్వామిని ఆంధ్ర ప్రదేశ్‌ హైకోర్టు న్యాయ మూర్తి జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి ప్రతా ప్‌ శుక్రవారం దర్శించుకు న్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ స్వాగతం పలుకగా అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు. స్వామి జ్ఞాపికను ఈవో ఎస్‌.చంద్రశేఖర్‌ అందజేశారు.

సూర్యనారాయణ స్వామి వారిని కేంద్ర డిప్యూటీ డైరెక్టర్‌, డైరెక్టర్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటలిజెన్స్‌ పూజ పుండ్కర్‌ దర్శించుకున్నారు. అర్చకులు స్వాగతం పలికి వేదమంత్రాలతో ఆశీర్వదించారు. స్వామి జ్ఞాపికను సిబ్బంది కృష్ణమాచార్యులు, చక్రవర్తి అందజేశారు.

Updated Date - Apr 20 , 2024 | 12:09 AM