Share News

పెద్దమ్మతల్లికి చల్లదనోత్సవం

ABN , Publish Date - Oct 21 , 2024 | 11:49 PM

పాత శ్రీకాకుళంలో జూన్‌లో పెద్ద మ్మతల్లి సిరిమానోత్సవాలు పురస్కరించుకుని సోమవారం చల్లదనోత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వ హించారు.

పెద్దమ్మతల్లికి చల్లదనోత్సవం
ముర్రాటలతో అమ్మవారి ఆలయానికి ఊరేగింపుగా వెళ్తున్న మహిళలు

శ్రీకాకుళం కల్చరల్‌, అక్టోబరు 21(ఆంధ్ర జ్యోతి): పాత శ్రీకాకుళంలో జూన్‌లో పెద్ద మ్మతల్లి సిరిమానోత్సవాలు పురస్కరించుకుని సోమవారం చల్లదనోత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వ హించారు. ఈ సందర్భంగా పెద్దమ్మతల్లి, నూకాలమ్మ తల్లి సిరిమనుచెట్లకు భక్తులు పూజలు చేశారు. దెశెల్లవీధి నుంచి భక్తులు ముర్రాటలతో నక్క, గొడారి,దండి, చాకలి, మా వూరు, హరిజన వీధులు, బాదుర్లపేట, కొత్తపే ట, కునుకుపేటల నుంచి ముర్రాటలతో ఊరే గించారు. ఖాజీపేట వద్ద రెండు చింతచెట్లకు, కొత్తపేట వద్ద గల వేపచెట్టుకు ముర్రాటలతో శుద్ధి చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వ హించారు.పూజల్లో సిరిమానోత్సవకమిటీ అధ్య క్షుడు డీపీ దేవ్‌, కమిటీ సభ్యులు మావూరు శేఖర్‌, శంకరరావు, సోంబాబు, గుత్తి చిన్నారా వు, గుంటుముక్కల పాపారావు పాల్గొన్నారు.

Updated Date - Oct 21 , 2024 | 11:49 PM