Share News

హైందవ ధర్మ పరిరక్షణకు పాటుపడాలి

ABN , Publish Date - Dec 07 , 2024 | 12:32 AM

హైందవ ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పా టుపడాలని ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు.

హైందవ ధర్మ పరిరక్షణకు పాటుపడాలి
చంద్రబాబుకు పుష్పగుచ్ఛం అందిస్తున్న ఎమ్మెల్యే శంకర్‌

- ఎమ్మెల్యే గొండు శంకర్‌

శ్రీకాకుళం రూరల్‌, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): హైందవ ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పా టుపడాలని ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు. గేదెలవానిపేటలో స్వయంభుగా వెలసిన ఉమామ హేశ్వర స్వామి పీఠం ప్రాంగణం లో కల్యాణ వెంకటేశ్వరుని ఆల య నిర్మాణానికి శుక్రవారం ఎమ్మె ల్యే గొండు శంకర్‌ శంకుస్థాపన చేశారు. ఆధ్యాత్మికతతో మెలిగే వారికి క్రమ శిక్షణ అలవడుతుందని, తద్వారా ప్రశాంత జీవనం పొందవచ్చునన్నారు. అనంతరం బంకుపల్లి రామచంద్రమూర్తి శర్మ ఆధ్వర్యంలో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

చంద్రబాబును కలిసిన ఎమ్మెల్యే

శ్రీకాకుళం అర్బన్‌, డిసెంబరు 6(ఆంధ్ర జ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబును శ్రీకాకు ళం ఎమ్మెల్యే గొండు శంకర్‌ మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. శుక్రవారం విశాఖ పర్యటనకు వచ్చిన చంద్రబాబుకు శంకర్‌ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నియోజకవర్గ సమస్యలు, సభత్వ నమోదు చంద్రబాబకు ఎమ్మెల్యే వివరించారు.

Updated Date - Dec 07 , 2024 | 12:32 AM