రోడ్డు నిర్మించకపోతే ఓటేసేది లేదు..
ABN , Publish Date - Apr 09 , 2024 | 12:00 AM
ఉయ్యాలపేట ప్రఽధాన సమస్య అయిన రోడ్డు నిర్మాణం చేపట్టే వరకు ఓటు వేసేది లేదంటూ స్థానిక యువకులు ప్రతిన బూనారు. ఈ మేరకు ఆదివారం రాత్రి యువత, చిన్నారులు ప్ల కార్డులు, కొవ్వొత్తులు పట్టుకుని నిరసన తెలిపారు.
- ఉయ్యాలపేటలో యువత నిరసన
నందిగాం, ఏప్రిల్ 8: ఉయ్యాలపేట ప్రఽధాన సమస్య అయిన రోడ్డు నిర్మాణం చేపట్టే వరకు ఓటు వేసేది లేదంటూ స్థానిక యువకులు ప్రతిన బూనారు. ఈ మేరకు ఆదివారం రాత్రి యువత, చిన్నారులు ప్ల కార్డులు, కొవ్వొత్తులు పట్టుకుని నిరసన తెలిపారు. ‘నో రోడ్-నో ఓట్’ అంటూ నినాదాలు చేశారు. గ్రామా నికి రోడ్డు నిర్మాణం చేపట్టకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, తమకు రాజకీయాలతో సంబంధం లేదని గ్రామానికి రోడ్డు వేసే వరకు ఓటుకు దూరంగా పేర్కొన్నారు. గ్రామ సమస్యను బాహ్య ప్రపంచానికి తెలిపేందుకే ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. గ్రామానికి పక్కా రహదారి నిర్మాణం, మంచినీటి సౌకర్యం, ఇతర మౌలిక సదుపాయాల సాధనే లక్ష్యమన్నారు కార్యక్ర మంలో గ్రామ యువత జనపాన కల్యాణ్, గణేష్, రాజు, రవి, దీర్ఘాసి కుమార స్వామి, తేజ, తులసీరావు, గేదెల నూకరాజు, సురేష్, పరపటి పృథ్వి తదితరులు పాల్గొన్నారు.