అక్రమ మద్యాన్ని అరికట్టాలి
ABN , Publish Date - Nov 19 , 2024 | 11:40 PM
ఒడిశా మద్యం ఆంధ్రా మీదుగా అక్రమ రవాణా జరగకుండా జాగ్రత్తతీసుకోవాలని, అక్రమ మద్యం అరికట్టాలని ప్రొహిబి షన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ డి.శ్రీకాంత్‌రెడ్డి కోరారు. మంగళవారం పురుషోత్తపురం చెక్‌పోస్ట్, ఇచ్ఛాపురం ఎక్సైజ్ కార్యాలయంలో రికార్డులను తనిఖీ చేశారు.
ఇచ్ఛాపురం, నవంబరు 19(ఆంధ్రజ్యోతి):ఒడిశా మద్యం ఆంధ్రా మీదుగా అక్రమ రవాణా జరగకుండా జాగ్రత్తతీసుకోవాలని, అక్రమ మద్యం అరికట్టాలని ప్రొహిబి షన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ డి.శ్రీకాంత్‌రెడ్డి కోరారు. మంగళవారం పురుషోత్తపురం చెక్‌పోస్ట్, ఇచ్ఛాపురం ఎక్సైజ్ కార్యాలయంలో రికార్డులను తనిఖీ చేశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ బెల్ట్ షాపులు ఎవరు నిర్వహించినా వెంటనే కేసులు పెట్టి తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేయాలని ఆదేశించారు.
ఫ సోంపేట, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): స్థానిక ఎక్సైజ్ స్టేషన్‌లో ప్రొహి బిషన్ అండ్ ఎక్సైజ్‌శాఖ డిప్యూటీ కమిషనర్ డీ.శ్రీకాంత్‌రెడ్డి మంగళవారం తనిఖీ నిర్వహించారు. ఆయన వెంట సీఐ కె.బాబీ ఉన్నారు.