ఉపాధ్యాయుడిపై విచారణ
ABN , Publish Date - Sep 20 , 2024 | 11:39 PM
ఎచ్చెర్లలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల గణిత ఉపాధ్యాయుడి పై వచ్చిన ఫిర్యాదుపై డిప్యూటీ డీఈవో ఆర్. విజయకుమారి, శ్రీకా కుళం బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వాగ్ధేవి శుక్రవారం విచారణ చేపట్టారు.
శ్రీకాకుళం క్రైం: ఎచ్చెర్లలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల గణిత ఉపాధ్యాయుడి పై వచ్చిన ఫిర్యాదుపై డిప్యూటీ డీఈవో ఆర్. విజయకుమారి, శ్రీకా కుళం బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వాగ్ధేవి శుక్రవారం విచారణ చేపట్టారు. ఈ పా ఠశాలకు చెందిన 8, 9 తరగతుల్లో చదువుతున్న కొంతమంది విద్యార్థులు ఫిర్యాదు చేసిన మేరకు వారి తల్లిదండ్రుల నుంచి వ్యక్తిగతంగా, రాతపూర్వకంగా వివరణ తీసుకున్నారు. గణిత ఉపాధ్యాయునిపై ఒక్కరు మాత్రమే ఫిర్యాదుచేయగా, మిగిలి న వారు ఆ ఫిర్యాదుతో ఎలాంటి సంబంధం లేదన్నిరు. పాఠశాల హెచ్‌ఎంకు ఉపాధ్యాయుల సహకారం సరిగాలేదని పలువురు తల్లిదండ్రులు డిప్యూటీ డీఈవోకు వివరించారు. ఈ మేరకు ఓ నివేదికను తయారుచేసి డీఈవోకు అందజేస్తామన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యయుడు జి.శ్రీరాములు, పేరెంట్స్ కమిటీ చైర్మన్ రవివర్మ తదితరులు పాల్గొన్నారు.