ఫీల్డ్ అసిస్టెంట్ అక్రమాలపై విచారణ
ABN , Publish Date - Nov 20 , 2024 | 11:33 PM
ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ ఎస్.రమణ అక్రమాలకు పాల్పడ్డా రంటూ గ్రామస్థులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు బుధవారం స్థానిక గ్రామ సచివాల యంలో ఉపాధి ఏపీడీ కె.లోకేష్ గ్రామసభ నిర్వహించి విచారణ చేప ట్టారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య తోపులాట ఏర్పడింది.
ఇరువర్గాల మధ్య వాగ్వాదం
పోలీసుల జోక్యంతో సద్దుమణిగిన వివాదం
జలుమూరు, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ ఎస్.రమణ అక్రమాలకు పాల్పడ్డా రంటూ గ్రామస్థులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు బుధవారం స్థానిక గ్రామ సచివాల యంలో ఉపాధి ఏపీడీ కె.లోకేష్ గ్రామసభ నిర్వహించి విచారణ చేప ట్టారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య తోపులాట ఏర్పడింది. వివరాలిలా ఉన్నా యి.. ఉపాధి పనులకు వెళ్లకుండా అనేక మందికి ఫీల్డ్ అసిస్టెంట్ రమణ వేతనాలు చెల్లించారని పలువురు గ్రామ స్థులు ఉన్నతాధికా రులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఏడీపీ లోకేష్ గ్రామసభ నిర్వహించి గ్రామస్థులతో విచారించారు. అయితే ఈ విషయంలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటా మాటా పెరిగి తోపు లాటకు దారితీసంది. దీంతో పోలీసులు జోక్యం చేసుకొని ఇరువర్గాలకు నచ్చచెప్పడంతో వివాదం సద్దు మణిగింది. దీనిపై ఏపీడీ లోకేష్ మాట్లాడుతూ.. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు జలుమూరు ఫీల్డ్ అసిస్టెంట్ రమణ అక్రమాలపై దర్యాప్తు నిర్వహించి నివేదికను జిల్లా అధికారులకు నివేదిస్తున్నట్లు తెలిపారు. కార్యక్ర మంలో ఏపీవో శేఖర్, సర్పంచ్ ఇప్పిలి దుర్గమ్మ, ఎంపీటీసీ డోల నాగరత్నం, ఏఎంసీ మాజీ అధ్యక్షుడు మునుకోటి దామోదరరావు, వేతనదారులు పాల్గొన్నారు.