Share News

Hospital: కేంద్రాసుపత్రిలో బిడ్డ మృతిపై విచారణ

ABN , Publish Date - Dec 27 , 2024 | 12:05 AM

Hospital: టెక్కలి జిల్లా కేంద్రాసుపత్రిలో బిడ్డ మృతిపై గురువారం ఆర్డీవో కృష్ణమూర్తి ప్రాథమికంగా విచారణ నిర్వహించారు. జిల్లా కేం ద్రాసుపత్రి ప్రసూతి విభాగంలో బుధవారం నందిగాం మండలంలోని కైజోల గ్రా మానికి చెందిన పడ్డ శ్రావణి మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే డెలివరీ సమయం లో బిడ్డ మెడకు పేగులు చుట్టుకోవడంతో ఆ బిడ్డ మృతిచెందింది.

Hospital: కేంద్రాసుపత్రిలో బిడ్డ మృతిపై విచారణ
బాధితురాలు, కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న ఆర్డీవో కృష్ణమూర్తి::

టెక్కలి,డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): టెక్కలి జిల్లా కేంద్రాసుపత్రిలో బిడ్డ మృతిపై గురువారం ఆర్డీవో కృష్ణమూర్తి ప్రాథమికంగా విచారణ నిర్వహించారు. జిల్లా కేం ద్రాసుపత్రి ప్రసూతి విభాగంలో బుధవారం నందిగాం మండలంలోని కైజోల గ్రా మానికి చెందిన పడ్డ శ్రావణి మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే డెలివరీ సమయం లో బిడ్డ మెడకు పేగులు చుట్టుకోవడంతో ఆ బిడ్డ మృతిచెందింది. దీంతో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం వల్లే బిడ్డ మృతిచెందిందని కుటుంబసభ్యులు ఆరోపించారు.


  • కలె క్టర్‌ స్వప్నిల్‌ దిన్‌కర్‌ పుండ్కర్‌ విచారణకు ఆదేశించారు. దీంతో గురువారం జిల్లా కేంద్రాసుపత్రిలో ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి, తహసీల్దార్‌ సాధు దిలీప్‌చక్రవర్తి వైద్యు రాలు ధనలక్ష్మి, శ్రవంతి, చిన్నపిల్లల వైద్యులు రామ్మోహనరావు, సీనియర్‌ వైద్యులు లక్ష్మణరావు, హెడ్‌నర్స్‌ నీలవేణి తదితరులను విచారించారు. తర్వాత పూర్తిసాయి విచారణకోసం డిప్యూటీ డీఎంహెచ్‌వో, సీనియర్‌ గైనకాలజీ వైద్య నిపుణులు, సీనియర్‌ చిన్నపిల్లల వైద్య నిపుణులతో త్రీమెన్‌ కమిటీకి సిఫారసు చేశారు. దీంతో శ్రీకాకుళానికి చెందిన గైనకాలజీస్టు జయశ్రీ, చిన్నపిల్లల వైద్య నిపుణులు సుధారాణి, డిప్యూటీ డీఎంహెచ్‌వోలు విచారణ నిర్వహించి 24గంటల్లో నివేదిక అందజేయాలని కలెక్టర్‌ అధికారులకు సూచించారు. కాగా ఆర్డీవో కృష్ణమూర్తి ఆసుపత్రిలో గురువారం వైద్యులు,సిబ్బందితో ప్రాథమిక విచారణచేసి అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. బిడ్డ తల్లిశ్రావణి, అత్త కృష్ణవేణి, భర్త శంకరరావులతో మాట్లాడారు. వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం వల్లే బిడ్డ మృతి చెందిందని ఆర్డీవో వద్ద విలపించా రు.కాగా విచారణకోసం కలెక్టర్‌ నియమించిన వైద్య నిపుణులు జయశ్రీ, సుధారాణి గురువారం రాత్రి సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో ఆర్డీవోను కలుసుకున్నారు.

Updated Date - Dec 27 , 2024 | 12:06 AM